అన్నింటికీ వంత‌పాడినోళ్లు.. రాజీనామాలపై నోరు మెద‌ప‌రేం..?

By Kalyan.S Aug. 05, 2020, 12:30 pm IST
అన్నింటికీ  వంత‌పాడినోళ్లు.. రాజీనామాలపై నోరు మెద‌ప‌రేం..?

యాక్షన్ 1 : ఈఎస్ఐ కుంభ‌కోణంలో అచ్చెన్నాయుడు అరెస్ట్...
చంద్ర‌బాబు : ఇది బీసీల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌... అచ్చెన్నాయుడును అక్ర‌మంగా అరెస్ట్ చేశారు.
టీడీపీ ఎమ్మెల్యేలు : అవును.. ఇది బీసీల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌... అచ్చెన్నాయుడును అక్ర‌మంగా అరెస్ట్ చేశారు.

యాక్షన్ 2 : వాహ‌నాల న‌కిలీ రిజిస్ట్రేష‌న్ల కేసులో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్ట్..
చంద్ర‌బాబు : వైఎస్ జగన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలు : అవును.. వైఎస్ జ‌గ‌న్ అలాగే చేస్తున్నారు. ఖండిస్తున్నాం.

యాక్షన్ 3 : హ‌త్య కేసులో టీడీపీ మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర అరెస్ట్
చంద్ర‌బాబు : కేవలం కక్ష సాధింపు కోసమే రవీంద్రను హత్య కేసులో ఇరికించారు.
టీడీపీ ఎమ్మెల్యేలు : అవును.. ఈ అరెస్ట్ కేవ‌లం క‌క్ష సాధింపే...

రాజ‌ధాని అంశంపై చంద్ర‌బాబు : అసెంబ్లీని ర‌ద్దు చేసి మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్దాం.. మా ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారు.
టీడీపీ ఎమ్మెల్యేలు : అవును.. మేం కూడా... మ్ మ్ మ్ .. సారీ సారీ నిశ్శ‌బ్దం..!

చంద్రబాబుకు సొంత ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు లేన‌ట్లేనా..?

చంద్రబాబు పార్టీకి కి గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మిగిలాయి. అందులోనూ ముగ్గురు వైసీపీకి మద్దతు పలికారు. మరొకరు తటస్థంగా ఉన్నారు. అంటే ఇంకా 19 మంది ఎమ్మెల్యే లు ఉంటారు. అందులో నలుగురు విశాఖ నగరానికి చెందిన వారే. అమరావతి కోసం రాజీనామా చేస్తే వారికి ఇక రాజకీయ భవిష్యత్ లేనట్లే. మిగిలిన 15 మంది ఎమ్మెల్యే లలో చంద్రబాబు సవాలుకి ఎవరూ ఇప్పటి వరకూ మద్దతు తెలపలేదు. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప లాంటి వారు మాట్లాడినా మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చారు తప్ప రాజీనామా చేస్తాం అని చెప్పలేదు. ఈ పరిణామాలన్నీ చంద్రబాబు సవాలు స్వీకరించడానికి సొంత పార్టీ ఎమ్మెల్యే లే వెనకడుగు వేసినట్టు స్పష్టం అయింది. అమరావతి కోసం రాజీనామా చేస్తే చివరకు చంద్రబాబు కూడా మళ్లీ గెలుస్తారు అనే గ్యారెంటీ కూడా లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp