విలీనంపై నోరు మెదపరెందుకు బాబూ..?

By Harinath.P Apr. 08, 2021, 06:52 pm IST
విలీనంపై నోరు మెదపరెందుకు బాబూ..?

నిద్ర లేచింది మొదలు ప్రజాస్వామ్యం, నైతిక విలువలు అంటూ ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు .. తెలంగాణలో తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసినప్పటికీ నోరు మెదపడం లేదు. తన పార్టీ గుర్తుపై గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లినా కనీసం స్పందించకపోవడం విడ్డురంగా ఉంది.

2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున కేవలం ఇద్దరు మాత్రమే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి మెచ్చా నాగేశ్వర్ రావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గతంలోనే గులాబీ పార్టీలో చేరారు. తాజాగా మెచ్చా నాగేశ్వరరావు గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో పాటు తెలంగాణ టీడీపీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ని కలిసి విన్నవించారు. దీనితో తెలంగాణలో టీడీపీ కథ కంచికి చేరినట్లైంది.

నాడు సంతలో పశువులు

గతంలో తన పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లే వారిని చంద్రబాబు అదే పనిగా టార్గెట్ చేసేవారు. అలా వెళ్లిన వారిని సంతలో పశువులతో పోల్చేవారు. కానీ, ఇదంతా గతంగానే మిగిలిపోయింది.

Also Read : తెలంగాణాలో ముగిసిన టిడిపి కథ.. టీఆర్‌ఎస్‌లో టీడీఎల్పీ విలీనం

ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినప్పటి నుంచి చంద్రబాబు ఆత్మ రక్షణ లోకి పడిపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా జంకే వారు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు తన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు క్యూ కట్టి మరీ గులాబీ తీర్థం పుచ్చుకున్నా పల్లెత్తు మాట మాట్లాడడానికీ భయపడ్డారు. మళ్లీ, ఏపీకి వచ్చే సరికి నాలుక మడత పెట్టేవారు. ఏపీ టీడీపీ నాయకులు వైసీపీలోకి వెళ్తే మాత్రం తన అనుయాయులు, పచ్చ మీడియా ద్వారా తిట్టి పోసేవారు. మళ్లీ బీజేపీ లోకి వెళ్తే మాత్రం మారు మాట అనే వారు కాదు.

ఇలా అక్కడో మాట ఇక్కడో మాట మాట్లాడడం వల్లే చంద్రబాబు తన క్రెడిబులిటీ కోల్పోయారు. తన నాయకత్వం మీద రోజు రోజుకి కేడర్ విశ్వాసం కోల్పోతున్నా ఆయన వైఖరిలో మార్పు రావట్లేదు. తన స్వార్థం కోసం తెలంగాణ లో టీడీపీ కి తనే పాడెకట్టారు. ఓటుకు నోటు కేసు వల్ల తెలంగాణలో పార్టీని గాలికొదిలేశారు. అలాగే 2019 ఎన్నికల్లో ఓడిపోగానే తన పార్టీకి చెందిన 4 రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి జంప్ చేయించారు. చంద్రబాబు చర్యలు చూస్తుంటే అవినీతి కేసుల్లో ఇరుక్కుని జైలుకి వెళ్లే బదులు తన పార్టీని బీజేపీలో విలీనం చేసే అవకాశాలు లేకపోలేదు.

Also Read : ఎన్నికల ప్రచారం.. నూతన ఒరవడికి వైఎస్‌ జగన్‌ శ్రీకారం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp