అమరావతి కోసం కూడా సీమ నేతలే రాజీనామా చేయాలా?

By Sanjeev Reddy Jul. 31, 2020, 09:58 pm IST
అమరావతి కోసం కూడా సీమ నేతలే రాజీనామా చేయాలా?

రాజధాని వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల వారూ స్వాగతిస్తున్నారు . రాయలసీమ , ఉత్తరాంధ్ర ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు . అమరావతి ప్రాంతంలో కూడా పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కావట్లేదు . కొందరు టీడీపీ పార్టీ నాయకులు ,అనుకూల మీడియాఛానల్లో కనిపించే స్థాయిలో ఉద్యమం గ్రౌండ్ లో లేదు.

వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించిన తరువాత కూడా టీడీపీ ఆశించిన ప్రతిస్పందన ప్రజలలో రాలేదు. కానీ పులివెందులకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మాత్రం వికేంద్రీకరణ బిల్లు మీద గవర్నర్ సంతకం చేయటానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు లేఖ రాశారు. గత అనుభవాల దృష్ట్యా, బిటెక్ రవి రాజీనామా లేఖ చంద్రబాబు సూచనతోనే బాబుని అడ్రెస్ చేసి రాశాడన్న అనుమానం రాజకీయవర్గాలలో ఉంది.

Also Read:చంద్రబాబు రాజకీయ జీవితం క్లైమాక్స్‌కు...ఆసక్తి రేపుతున్న GVL కామెంట్స్

అమరావతి ఒక్కటే రాజధానిగా కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లును సీమ , ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తుండగా , ఆది నుండీ వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ పార్టీ నుండి గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా CRDA ప్రాంతం లేదా కృష్ణా ,గుంటూరు జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కాకుండా రాయలసీమ నుండి బీటెక్ రవి చేత మండలి సభ్యత్వానికి రాజీనామా చేయించడం కొందరికి ఆశ్చర్యం అనిపించవచ్చు కానీ బాబు గారి రాజకీయపుటెత్తులు తెలిసిన వారికి మాత్రం ఆశ్చర్యం కలిగించదు .

వికేంద్రీకరణను స్వాగతించే ప్రాంతం నుండి తన పార్టీ ప్రతినిధి చేత రాజీనామా చేయించి మీడియా దృష్టి తమ వైపుకి తిప్పుకుని వికేంద్రీకరణకు అన్ని ప్రాంతాల వారూ వ్యతిరేకమే అనే భావన తీసుకొచ్చే ఎత్తుగడను టీడీపీ వేస్తున్నట్లుంది.

నిజానికి అమరావతి కోసం రాజీనామాలు అయినా చేసే చిత్తశుద్ధి టీడీపీ అధినాయకత్వంలో ఉంటే ఈ రాజీనామా సీమ నుండి కాదు . గడిచిన ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నుండి ప్రతిష్టాత్మకంగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి నారా లోకేష్ ఇప్పటికీ ఎమ్మెల్సీ గానే ఉన్నారు . మంగళగిరి టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న లోకేష్ చేత రాజీనామా చేయించకుండా సీమకి చెందిన బీటెక్ రవి చేత రాజీనామా చేయించడంలోనే టీడీపీ ఉద్దేశ్యం బట్టబయలు అయ్యింది.

Also Read:మోపిదేవికి వైసీపీలో కీలక బాధ్యతలు

సీమ నుంచే రాజీనామా చేయించాలనుకుంటే హిందూపురం నుంచి గెలిచిన తన బావమరిది బాలకృష్ణనో లేకుంటే సీనియర్ నేత ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తోనో రాజీనామా చేయించవల్సింది, ప్రజలు కొంచమైనా నమ్మేవారు.

టీడీపీ ఇహనైనా ఈ తరహా రాజకీయాలు కట్టిపెట్టాలి . రాజధానికి భూములిచ్చి ఈ రోజు భవిష్యత్తు పై సందిగ్ధావస్థలో ఉన్న రైతులకు సమాధానం చెప్పాలి. వారు ఏకీకృతమై ప్రభుత్వంతో చర్చించి తమ భూసమస్యలు పరిష్కరించుకొనేందుకు మద్దతు ఇవ్వాలి. .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp