Kommareddy Pattabhi ram - టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ప్రత్యేకత ఏమిటీ?

By Voleti Divakar Oct. 21, 2021, 01:30 pm IST
Kommareddy Pattabhi ram - టీడీపీ అధికార  ప్రతినిధి పట్టాభి ప్రత్యేకత ఏమిటీ?

ప్రత్యేక కథనాలు , పదుల సంఖ్యలో ఫొటోలు , రోజంతా టీవీల్లో చర్చలు చూస్తే రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అనుకూల ఎల్లో మీడియా కార్యాలయాలపైనే దాడులు జరిగాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి . తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం , పట్టాభి ఇంటిపై జరిగిన దాడులపై ఎల్లో మీడియా తెగ బాధపడిపోతున్నట్లు కనిపిస్తోంది . తాము పెంచిపోషించిన నాయకుడిపై దాడి జరిగితే ఆమాత్రం బాధ ఉండదా అన్న వ్యంగ్య వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి .

కొమ్మారెడ్డి పట్టాభి ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియదు . కనీసం గూగుల్లో కొట్టి చూసినా ఆయన గురించి సమాచారం దొరకడం లేదు . అతిధ్య, కేటరింగ్ రంగ వ్యాపారం చేసే పట్టాభి నివసించే విజయవాడ నగరవాసులకు కూడా పట్టాభి గురించి తెలియదు. కనీసం వార్డు సభ్యుడిగా గెలిచిన చరిత్ర ఆయనకు లేదు .

నోటి దురుసే పట్టాభి ప్రత్యేకత ...

కొమ్మారెడ్డి పట్టాభికి తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత చూస్తే పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నాయకులకు కూడా ఆసూయ కలుగుతోంది. ఆయన ఇంటిపై దాడి జరిగితే స్వయంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వచ్చి పరామర్శిస్తారు . పార్టీలో పట్టాభికి ప్రత్యేకత ఏమిటంటే నోటి దురుసుతనం . ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బూతులతో బురద జల్లడం ద్వారా ఎల్లో మీడియాకు మేత అందించడమే పట్టాభి పని. 

Also Read : CM YS Jagan - అల్టిమేట్టం జారీ చేసిన సీఎం జగన్‌.. ఇక గీత దాటితే ఇబ్బందులు తప్పవా..?

చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా పట్టాభి వంటి నాయకులను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి . అయితే టిడిపి కార్యకర్తలు , ఎల్లో మీడియాకు వినోదం పంచుతున్న పట్టాభి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తేలిగ్గా తీసుకున్నా...ఆయన అభిమానులు , పార్టీ కార్యకర్తలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు . పర్యవసానమే ఆయనపై పదేపదే దాడులు. గత ఏడాది డిసెంబర్ , ఫిబ్రవరిలో , ఇటీవల కాకినాడలో.. తాజాగా విజయవాడలో పట్టాభిపై దాడి చేసే ప్రయత్నాలు జరిగాయి . కాకినాడలో ఆయన మత్స్యకారులను హెరాయిన్ స్మగ్లర్లతో పోల్చడంతో వారు ఆగ్రహంతో పట్టాభిని చుట్టుముట్టారు . తాజాగా ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్లు మాట్లాడటంతో పట్టాభి ఇంటిపై దాడి జరిగింది .

రాష్ట్రంలోని మిగిలిన టిడిపి నాయకులు , ప్రతిపక్షాలు కూడా వైఎస్ జగన్ ను , ఆయన ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తారు . అయితే వారిపై ఎందుకు దాడులు జరగడం లేదు..? పదేపదే పట్టాభిపై మాత్రమే ఎందుకు దాడులు జరుగుతున్నాయన్నది ఆలోచించాల్సిన విషయం . కారణం ఆయన మాట తీరే అన్నది సుస్పష్టం .

పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యలను వాటంగా తీసుకుని చంద్రబాబునాయుడు రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వడంతో పాటు , 36 గంటల నిరసన దీక్షకు దిగారు . చంద్రబాబుతో సహా పట్టాభి జగన్ పై చేసిన వ్యాఖ్యలను ఒక్క టిడిపి నాయకుడు ఖండించకపోగా మరింత రెచ్చగొట్టే విధంగా బంద్ కు , నిరసన దీక్షలకు పిలుపునివ్వడం వ్యూహాత్మకమేనన్న అనుమానాలు కలుగుతున్నాయి .

Also Read : TDP Pathabhi -వివాదాస్పద టీడీపీ నేత పట్టాభి అరెస్ట్..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp