‘సింగపూర్ వెళ్లిపోయింది’ - ఎక్కడకు వెళ్ళిపోయిందయ్యా?

By Kirshna Kiran M 13-11-2019 11:39 PM
‘సింగపూర్ వెళ్లిపోయింది’ - ఎక్కడకు వెళ్ళిపోయిందయ్యా?

‘సింగపూర్ వెళ్లిపోయింది’ - ఎక్కడకు వెళ్ళిపోయిందయ్యా? ఆయనుంటే కలిసి కుమ్మేద్దామని వచ్చారు. ఇప్పుడు కుదరదు కాబట్టి పోయారు. ఏం సింగపూర్? ఎందుకు సింగపూర్? మనకు మనం చేసుకోలేనిదాన్ని, సింగపూర్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పమనండి.

మనదేశంలో సింగపూర్ వాళ్ళు ఏ రాష్ట్రంలో ఏం చేసారు అనేది ఎవరికన్నా తెలుసా? వాళ్లు వెళ్ళిపోవడం వల్ల రాష్ట్రంలో ఏదో ఘోరం జరిగినట్టు, అంధకారమయిపోయినట్లు రాజకీయ లబ్ధికోసము చేసే చిత్రీకరణ వల్ల రాష్ట్రానికి మరింత ద్రోహం, నష్టం చేస్తున్నారని గుర్తించాలి. 

‘అంతా నాకే తెలుసు’ అని ఏకపక్ష నిర్ణయాలతో సింగపూర్ వారిని అసలు ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారు? ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికెగిరినట్టు, మసిపూసి మారెడుకాయ చేసినట్లు, ఐదు సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టి, చవకబారు పబ్లిసిటీతో ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని ఈ రోజు ఒక దుర్భర పరిస్థితిలోకి నెట్టి వాళ్ళెళిపోయారు, వీళ్ళెళిపోయారు అని గోల చేయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? అసలు మీరు అధికారం నుండి దించబడడానికి కారణం ఈ ‘సింగపూర్’ లాంటి వ్యవహారాలు కాదా? ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏ పని చేసినా ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం ఎంతైనా వుంది. గత ప్రభుత్వం చేసిన తప్పులు కారణంగా, ఈ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చే అవకాశం వచ్చింది. అది జాగ్రత్తగా నిలబెట్టుకుంటూ, అనాలోచితమైన పనులు చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడవవలసిన బాధ్యత వారిపై వుంది. 

సింగపూర్ వారు ఉన్నారా, పోయారా అనేది అసలు సబ్జెక్టే కాదు. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో పని చేసుకుంటూ పోతే వంద సింగపూర్ లు మన రాష్ట్రానికి రావడానికి క్యూ కట్టవా?

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News