చంద్రబాబు: ఆవు వ్యాసమా.. సంచలనమా..?

By Kotireddy Palukuri Aug. 05, 2020, 03:19 pm IST
చంద్రబాబు: ఆవు వ్యాసమా.. సంచలనమా..?

మూడు రాజధానులపై రెఫరెండం కోరుతూ అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు విధించిన 48 గంటల డెడ్‌లైన్‌ ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తోంది. తాను చేసే డిమాండ్‌ ఆచరణ సాధ్యం కాదన్న విషయం చంద్రబాబు తెలిసినా కూడా చేసి తాను ఏదో చేయబోతున్నాననే ఉత్కంఠకు తెరలేపారు. ఈ 48 గంటల్లో టీడీపీ నేతలు.. తమ అధినేత విసిరిన సవాల్‌ స్వీకరించాలని అధికార పార్టీని అడిగారు, డిమాండ్‌ చేశారు, రెచ్చగొట్టారు. కానీ రాజకీయమైన ప్రకటనలకు తప్పా చంద్రబాబు డిమాండ్‌ హాస్యాస్పదమైనదన్న విషయం అందరికీ తెలిసిందే.

నేను రాజీనామా చేస్తున్నా.. మీరు చేయండి.. ఎవరి వాదనకు ప్రజలు మొగ్గు చూపుతారో.. అని ఎవరైనా సవాల్‌ చేస్తారు. కానీ ఇక్కడ చంద్రబాబు మాత్రం.. మీరు రాజీనామా చేయండి అంటున్నారే తప్పా.. ఇదిగో నేను రాజీనామా చేస్తున్నాని మాత్రం చెప్పడం లేదు. ఆయన నిర్వహించే జూమ్‌ సమావేశాల్లో విలేకర్లు అడిగితే మాత్రం వైసీపీ వాళ్లు రాజీనామా చేస్తే.. మేము చేస్తాం అంటూ తనదైన శైలిలో మాట్లాడుతున్నారు. ప్రతి జూమ్‌ సమవేశంలో చెప్పిన విషయమే చెబుతూ ఆవు వ్యాసాన్ని తలపించేలా మాట్లాడుతున్నారు. అయితే రాజీనామాలపై 48 గంటల తర్వాత చంద్రబాబు ఏమి చేస్తారన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు, మీడియా వర్గాలు సాయంత్రం ఐదు గంటల తర్వాత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఇప్పటికే చంద్రబాబు ప్లాన్‌ సిద్ధం చేసుకుని ఉంటారు. తాను విసిరిన సవాల్‌ ఎలాగూ ఆచరణలోకి రాదు కాబట్టి ఆ తర్వాత స్టెప్‌ ఎలా వేయాలన్నది బాబు సిద్ధమయ్యే ఉంటారు. అయితే అది ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. చంద్రబాబు తానొక్కడే రాజీనామా చేస్తారా..? లేక తన పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా చేయిస్తారా..? లేదా భయపడి తన సవాల్‌ను వైసీపీ స్వీకరించలేదంటూ ఎప్పటిలాగే అమరావతిపై అవు వ్యాసం వినిపించి, తాను మాట్లాడినది చరిత్రలో నిలిచిపోతుందని అంటారా..? వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp