విస్తరిస్తోన్న'నాడు నేడు'

By Kotireddy Palukuri 19-11-2019 07:38 AM
విస్తరిస్తోన్న'నాడు నేడు'
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు జగన్ సర్కార్ పెద్ద పీట వేస్తోంది. ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణకు నాడు నేడు కార్యక్రమం అమలు చేస్తున్న ప్రభుత్వం దీనిని మరిన్ని రంగాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు వేదికలైన మార్కెట్‌ యార్డులను ‘నాడు–నేడు’ కింద ఆధునికీకరించడంతో పాటు మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను పటిష్ట పరచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పంటల ధరలు ఎక్కడ పడిపోతుంటే అక్కడ వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా గిట్టుబాటు ధర కంటే తక్కువకు అమ్మేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఐదో అగ్రి మిషన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్‌ యార్డ్‌ విధిగా ఉండాలన్నారు. అవసరమైతే అధ్యయనం చేసి మరికొన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
56 రైతు బజార్లను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన చోట్ల వేరుశనగ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, చిరుధాన్యాల శుద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. చిరుధాన్యాల సాగు ఖర్చు పరిగణనలోకి తీసుకుని గిట్టుబాటు అయ్యేలా తక్షణమే కొనుగోలు ధర నిర్ణయించాలన్నారు. రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు 45,20,616 మంది రైతు కుటుంబాలు లబ్ధి పొందాయి. వచ్చే మే నెల వరకు కొత్తగా అర్హత కలిగిన రైతులకు రైతు భరోసా అందించనున్నారు. గ్రామ సచివాలయాల పక్కన ఏర్పాటు చేసే దుకాణాలు, వర్క్‌షాపులు జనవరి 1 నుంచి ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు.
idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News