విశాఖ రాజధానిగా ఉండాలని 66ఏళ్ళ క్రితమే ప్రతిపాదన

By Krishna Babu Aug. 01, 2020, 02:35 pm IST
విశాఖ రాజధానిగా ఉండాలని 66ఏళ్ళ క్రితమే ప్రతిపాదన

రాష్ట్ర విభజన అనంతరం 13 జిల్లాలుగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ కు జరిగిన ఎన్నికల్లో, నెగ్గి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రానికి రాజధానిగా అమరావతి పరిసర ప్రాంతాన్ని ఎంపిక చేయడం, ఆపై అక్కడ 5 ఏళ్ల సమయంలో రాజధాని పేరిటి లక్ష కోట్ల రూపాయల ప్రణాళికలు వేసినా చెప్పుకోదగ్గ అభివృద్ది చేయకపోవడంతో పాటు అనేక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలు వచ్చాయి. డిజైన్ల పేరుతో గ్రాఫిక్స్ ఒక పక్క చూపుతూ, నిర్మించిన తాత్కాలిక భవనాల్లో వర్షం వస్తే లీకేజీలతో, జరిగిన అవినీతి ప్రజల కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఈ నేపధ్యంలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు గారికి రాజధాని ప్రాంతంలోనే గట్టి దెబ్బ తగిలింది. ఆయన తనయుడు లోకేష్ సైతం ఆ ప్రాంతంలో ఓటమి చెందారు.

2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం గత పాలనలో చంద్రబాబు చేసిన తప్పిదాలను సరిదిద్దే కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర అభివృద్ది అంతా ఒకే చోట కేంద్రీకృతమై ప్రాంతీయ అసమానతలు పెరిగి గతంలో జరిగిన తప్పులే మళ్ళి జరగకుండా ఉండేలా అభివృద్ది వికేంద్రికరణ ప్రణాళికతో ముందుకు వచ్చారు. రాష్ట్రాంలో అభివృద్ది మూడు ప్రాంతాలకు విస్తరించాలనే ఆలోన చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్రానికి పరిపాలనా రాజధానిగా విశాఖను, న్యాయ రాజధానిగా కర్నూలును, శాసన రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి ఏళ్ళ తరబడి వెనకబడిన ప్రాంతాలకి సైతం అబివృద్ది చెందేలా బిల్లుని ప్రవేశపెట్టి అనేక అడ్డంకులనడుమ చివరికి దానికి చట్టబద్దత కల్పించారు.

అయితే విశాఖ రాజధాని గా చేయాలనే ప్రతిపాదన 66 ఏళ్ళ తరువాత మళ్ళీ తెరపైకి వచ్చి అది అమలయ్యే దిశగా అడుగులు పడుతోంది. చరిత్రలో మరుగున పడిపోయిన ఒక అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా తొలుత కర్నూలును ఎంపిక చేస్తూ 1953 అక్టోబరు 1న రాష్ట్రం ఏర్పడింది. అయితే 1953 నవంబర్ 30న జరిగిన సభలో శాశ్వత రాజధానిగా విశాఖ ఉండాలని 1956 ఏప్రిల్ 1 వరకు కర్నూలు రాజధానిగా ఉన్న ఆ తరువాత విశాఖకు మార్చాలని ఆనాడు స్వతంత్ర పార్టి అభ్యర్ధి రొక్కం లక్ష్మీ నరసింహ దొర అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సవరణ మూడు ఓట్ల తో నెగ్గిందని ఆంధ్ర శాసనసభ స్పీకర్ నల్లపాటి వెంకట రామయ్య ప్రకటించారు. రొక్కం నరసింహ దొర ప్రవేశ పెట్టిన సవరణకు అనుకూలంగా 61 ఓట్లు, ప్రతికూలంగా 58 ఓట్లు, తటస్థంగా 20 మంది ఉండటంతో సవరణ ఆమోదం పొందింది. 

ఇదిలా ఉంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం రాష్ట్రాల పునర్విభజన కమీషను (ఫజల్ అలీ కమిషన్) డిసెంబర్ 29, 1953లో నియమించడం జరిగింది. అయితే ఈ కమీషన్ హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే తెలంగాణా ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ఒప్పందాల నడుమ విలీనం చేసే ప్రతిపాదన చేయడంతో 1956 నవంబర్ 1 న హైద్రబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పాటు అయింది. దీంతో విశాఖ రాజధాని ప్రతిపాదన కాల గర్భంలో కలిసిపోయింది. ఈ విషయంపై ఏ పాఠ్యంశంలోను లేకపొవడం శోచనీయం.

ఇక తాజాగా 66ఏళ్ల తరువాత తిరిగి జగన్ ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తు నిర్ణయించడం దానికి గవర్నర్ ఆమోదంతో చట్టంగా రూపుదాల్చడంతో దశాబ్దాల కాలం నాటి ప్రతిపాదన నేడు కార్యరూపం దాల్చి విశాఖ ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా అవతరించబోతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp