Visakha Railway Station, Privatization - 45 లేదా 99 ఏళ్ళు.. విశాఖ రైల్వే స్టేషన్ ప్రైవేటుపరం!

By Ramana.Damara Singh Dec. 07, 2021, 05:40 pm IST
Visakha Railway Station, Privatization - 45 లేదా 99 ఏళ్ళు.. విశాఖ రైల్వే స్టేషన్ ప్రైవేటుపరం!

రాష్ట్ర విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచిన ప్రధాన హామీల్లో విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయడం అతి ముఖ్యమైనది. జోనల్ కేంద్రంగా విలసిల్లాల్సిన విశాఖ రైల్వేస్టేషన్ కేంద్ర ప్రభుత్వ తీరుతో ప్రైవేట్ వాణిజ్య కేంద్రంగా మారిపోనుంది. రీ డెవలప్మెంట్ పేరుతో విశాఖ స్టేషన్ ను దీర్ఘకాల లీజుకు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాలని కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దేశంలోని ప్రముఖ కార్పొరేట్ గ్రూప్ అయిన జీఎమ్మార్ సంస్థ దీన్ని చేజిక్కించుకోవడానికి ముందుకొచ్చింది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన 45 ఏళ్ల లీజు కాలపరిమితిని 99 ఏళ్లకు పెంచాలని ఒత్తిడి చేస్తోంది. ఆ ఒక్కటి తప్ప మిగతా ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి అయ్యాయి.

స్టేషన్ పై సర్వాధికారాలు వారికే

ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థలు, పోర్టులు, విమానాశ్రయాలను అమ్మేయడమో, లీజుకు ఇవ్వడమో చేస్తున్న మోదీ సర్కారు రైల్వేస్టేషన్లను కూడా ఆ వరుసలో నిలబెట్టింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, రెవెన్యూ పెంచడమే లక్ష్యమని చెబుతూ ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు దేశవ్యాప్తంగా 200 స్టేషన్లను ఎంపిక చేసింది. వీటి పరిధిలోని 2200 ఎకరాల విలువైన స్థలాలను షాపింగ్ కాంప్లెక్సులు, మాల్స్, రియల్ ఎస్టేట్ అభివృద్ధి పనులకు అప్పగించనున్నారు. అందులో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్ ఉన్న 35 ఎకరాల ప్రాంగణాన్ని కేంద్రం ఆదేశాలతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ప్రతిపాదించారు. దీనికి ముందుకొచ్చిన జీఎమ్మార్ సంస్థ దాంతోపాటు పక్కనే ఉన్న రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు చెందిన పది ఎకరాలను కూడా తీసుకోవాలని ప్రయత్నిస్తోంది.

లీజు కాలంపై నేరుగా కేంద్రంతో మంతనాలు

స్టేషన్ లీజు కాలపరిమితి తప్ప మిగతా అన్ని సన్నాహాలు పూర్తి కావచ్చాయి. రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు పలుమార్లు స్టేషన్ను పరిశీలించారు. 45 ఏళ్లకు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా.. 99 ఏళ్లకు ఇవ్వాలని జీఎమ్మార్ కోరుతోంది. దానికి ఈస్ట్ కోస్ట్ జోన్ రైల్వే అధికారులు నిరాకరించారు. దాంతో జీఎమ్మార్ ప్రతినిధులు కేంద్ర పెద్దలతో నేరుగా సంప్రదింపులు మొదలుపెట్టారు. కేంద్రంలో కదలిక కనిపిస్తోందని.. ఎటువంటి నిర్ణయం వెలువడుతుందోనని రైల్వే అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Also Read : Somu Veerraju, Political Monasticism - వీర్రాజు రాజకీయ సన్యాసం తీసుకుంటారట, ఎందుకో తెలుసా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp