విజయవాడ మేయర్ పీఠం మీద పంతం నెగ్గించుకున్న కేశినేని నాని

By Raju VS Mar. 04, 2021, 05:26 pm IST
విజయవాడ మేయర్ పీఠం మీద పంతం నెగ్గించుకున్న కేశినేని నాని

తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రకటన వెలువడింది. విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని కుమార్తెను ఖాయం చేశారు. మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ అభ్యర్థిగా ఆమె పేరుని చంద్రబాబు ఖరారు చేసి అధికారికంగా ప్రకటించారు.

శ్వేత అభ్యర్థిత్వం ఎప్పుడో ఖాయం కావలసింది. కొంత కాలం కేశినేని నాని ,బుద్ధా వెంకన్న వర్గాలమధ్య నడిచిన ఆధిపత్య పోరు వలన శ్వేతా అభ్యర్థిత్వం ప్రకటన ఆలాస్యం కాగా, గుంటూరు మేయరు పదవికి కేశినేని సామాజిక వర్గానికే చెందిన కోవెలమూడి రవీంద్రను ఎంపిక చేయటంతో రెండు నగరాలకు ఒకే సామాజిక వర్గం నుంచి మేయర్ అభ్యర్థిత్వం ఇవ్వవద్దని బుద్ధా వెంకన్న వర్గం శ్వేతాను అడ్డుకోవటానికి చివరి వరకు ప్రయత్నం చేసింది.

విజయవాడ మేయర్ పీఠం మీద కేశినేని నాని చాలాకాలంగా కన్నేశారు. తనను కాదని పార్టీ అధిష్టానం కూడా ముందుకెళ్లలేదన్నట్టుగా ఆయన ధీమాతో కనిపించారు. పదే పదే మీడియా ముందు కూడా టీడీపీ అధిష్టానాన్ని ఖాతరు చేయడం లేదన్నట్టుగా ప్రకటనలు గుప్పించారు. ఆ క్రమంలోనే కేశినేని నానికి వ్యతిరేకంగా నగరంలోని ఇతర నేతలు ఒక్కటయ్యారు. బుద్ధా వెంకన్న, నాగూల్ మీరా, బోండా ఉమాతో పాటుగా అదికార ప్రతినిధి పట్టాభి కూడా చేతులు కలిపి కేశినేని నానికి వ్యతిరేకంగా పావులు కదిపే ప్రయత్నం చేశారు. ఇటీవల 39వ డివిజన్ అభ్యర్థిత్వం విషయంలో ఇరు వర్గాలు పట్టింపులకు పోవడంతో చివరకు పెద్ద తలనొప్పిగా మారింది. అదే సమయంలో విజయవాడ మేయర్ పీఠం కమ్మ కులస్తులకు కాకుండా తమకే ఇవ్వాలని బీసీ, కాపు వర్గాల నుంచి పోటీ ప్రయత్నాలు మొదలయ్యాయి.

Also Read:కెమెరాకు చిక్కిన మంత్రి జార్కి హోళీనే నాడు ఆ ప్రభుత్వాన్ని కూల్చింది

దానికి చెక్ పెట్టే ఉద్దేశంతో నాని వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠం తనకే దక్కాలని ఆయన టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. దాంతో చంద్రబాబు అటు బుద్ధాని సముదాయించలేక, ఇటు నానికి సర్థి చెప్పలేక తీవ్రంగా సతమతమయ్యారు. కానీ చివరకు నాని విషయంలో తేడా వస్తే వ్యవహారం మారిపోతుందని ఆందోళన చెందిన చంద్రబాబు చివరకు ఆయన కుమార్తె పేరుని ఖరారు చేశారు.

ఆయన కోరుకున్నట్టుగా జరగడంతో ఇప్పుడు కేశినేని పంతం నెగ్గించుకున్నప్పటికీ ప్రజల్లో పట్టు నిలుపుకోవడం అంత సులువు కాదని స్పష్టమవుతోంది. ఇప్పటికే రాష్ట్రమంతా హవా చాటుతున్న వైఎస్సార్సీపీ విజయవాడలో కూడా పావులు కదుపుతోంది. మంత్రి వెల్లంపల్లి, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్‌ కాంబినేషన్ లో ఆపార్టీ దూసుకుపోతోంది. దాంతో టికెట్ వచ్చిందనే సంతృప్తి తప్ప నానికి ఏం మిగులుతుందో అనేది చర్చనీయాంశం అవుతోంది.

Also Read:విజయవాడ టీడీపీ - కేశినేని ఒక వైపు,మిగిలిన ముగ్గురు మరో వైపు

అయితే నాని దూరదృష్టి ఉన్న నాయకుడని,గెలుపు మీద నమ్మకం లేకపోయినా కూతురుని మేయరు అభ్యర్థినిగా ప్రకటించుకోవటం వెనుక భవిషత్ రాజకీయాలతో ముడిపడిన ఆలోచన ఉందని,విజయవాడ రాజకీయాల్లో కేశినేని శ్వేత కీలకం గా ఎదుగుతుందని విజయవాడ రాజకీయవర్గాలలో అభిప్రాయం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp