స్వాతంత్ర వేడుకులకు ముస్తాబవుతున్న ఇందిరా గాంధీ స్టేడియం

By Kotireddy Palukuri Aug. 14, 2020, 07:39 pm IST
స్వాతంత్ర  వేడుకులకు ముస్తాబవుతున్న ఇందిరా గాంధీ స్టేడియం

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌లో సర్వం సిద్ధం అవుతోంది. ఏపీ ప్రభుత్వం ఈ వేడుకలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం సర్వాంగ సుదరంగా ముస్తాబవుతోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతిభంభించేలా స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు. జాతీయ జెండాను స్టేడియం మొత్తం రెండు వరుసల్లో ఏర్పాటు చేశారు. మువ్వన్నెల జెండా.. గుండ్రటి స్టేడియాన్ని చుట్టడంతో స్టేడియం మొత్తం చూడచక్కగా ఉంది. జాతీయ భావం ఉప్పొంగేలా ఇందిరా గాంధీ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెండో ఏడాది స్వాతంత్ర దినోత్స వేడుకలు ఇందిరా గాంధీ స్టేడియంలో వేదిక కాబోతోంది. గత ఏడాది విశాఖ కేంద్రంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయని ప్రచారం సాగినా.. విజయవాడలోనే నిర్వహించారు. మూడు రాజధానుల ఏర్పాటు నేపథ్యంలో ఈ సారి కూడా విశాఖలో వేడుకలు జరుగుతాయనే ప్రచారం సాగింది. అయితే ఆ ఊహాగానాలన్నింటికీ చెక్‌ పెడుతూ విజయవాడలోనే వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను దాదాపు పూర్తి చేసింది. రేపు శనివారం ఉదయం సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. జిల్లా కేంద్రాల్లో జరిగే వేడుకల్లో ఆయా జిల్లాల ఇంఛార్జి మంత్రులు పాల్గొని జెండా ఆవిష్కరణ చేయనున్నారు.


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp