ఎస్వీబీసీ ఛానల్‌ చైర్మన్ గా వెంకటగిరి రాజా నియామకం

By Krishna Babu Oct. 28, 2020, 08:41 pm IST
ఎస్వీబీసీ ఛానల్‌ చైర్మన్ గా వెంకటగిరి రాజా నియామకం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ (SVBC) నూతన చైర్మన్ గా నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటగిరి సంస్థానం రాజ కుటుంబ వారసులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెలుగోటి బాస్కర సాయికృష్ణ యాచేంద్ర నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ళ పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది.

ఎన్.టీ.ఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన సాయి కృష్ణ 1985లో వెంకటగిరి నుండి తెలుగుదేశం తరుపున పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్ధి బాలకృష్ణా రెడ్డి పై విజయం సాదించి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004లో తిరిగి తెలుగుదేశం తరుపున పోటీలో దిగి నేదురుమల్లి రాజ్యలక్ష్మి చేతిలో ఓటమి పాలయ్యారు.

మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న సాయి కృష్ణ 2014 తరువాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు విస్మరించడంతో తీవ్ర మనస్థాపం చెందారు. చంద్రబాబు విధానాలతో నొచ్చుకున్న ఆయన తెలుగుదేశం నేతల సమక్షంలోనే చంద్రబాబు విధానాలను తూర్పారబట్టారు . ఆ తరువాత 2019 ఎన్నికల ముందు ఆ పార్టీతో విభేదించి వైయస్సార్ కాంగ్రెస్ లో చేరి వైసీపీ విజయానికి కృషి చేసారు .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp