'ఆ ఎంపీ న్యూస్‌ పేపర్‌ కూడా చదవలేరు'

By Kotireddy Palukuri May. 23, 2020, 01:18 pm IST
'ఆ ఎంపీ న్యూస్‌ పేపర్‌ కూడా చదవలేరు'

టీడీపీ నేత వర్ల రామయ్య బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై విమర్శల వర్షం కురిపించారు. కోర్టు తీర్పులు చంద్రబాబుకు ముందే తెలుస్తున్నాయన్న ఎంపీ సురేష్‌పై వర్ల ఫైర్‌ అయ్యారు. ఎంపీ అవగాహన రాహిత్యంతో ఎవరో మాట్లాడమంటే మాట్లాడుతున్నారన్నారు. ఎంపీ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయన్నారు.

‘‘హైకోర్టు మేనేజిబుల్‌ అని మీరు చెబుతున్నారు. మీ లాంటి వారిని పార్లమెంట్‌ను పంపామని ప్రజలకు తలదించుకుంటున్నారు. నందిగం సురేష్‌కు ఏమైనా ఆలోచన ఉందా..? విద్యాబుద్ధులు నేర్చుకున్నారా..?. న్యూస్‌ పేపర్‌ కూడా చదవలేరని బయట చెబుతున్నారు’’ అంటూ వర్ల రామయ్య ఫైర్‌ అయ్యారు.

నందిగం సురేష్‌ వ్యాఖ్యలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించాలని వర్ల కోరారు. కంటెమ్ట్‌ ఆఫ్‌ ది కోర్టు కింద కేసు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కోర్టు వెంటనే కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఆయనపై పెట్టిన కేసు తేలే వరకూ నందిగం సురేష్‌ను సుప్తచేతన అవస్థలో పెట్టాలని డిమాండ్‌ చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp