భారతదేశ సమర నినాదం ఉధం సింగ్

By Krishna Babu Jul. 31, 2020, 02:48 pm IST
భారతదేశ సమర నినాదం ఉధం సింగ్

నేను నా దేశం కోసం చనిపోతున్నాను. నేడు దేశం ఉన్న పరిస్థితుల్లో మనం వృద్దాప్యం వరకు వేచి ఉండి ఏమి ఉపయోగం అంటూ బ్రీటిష్ పాలకుల పైశాచికత్వానికి ఎల్లలు దాటి, ఏరులు దాటి వెళ్ళి సుదీర్ఘ నీరిక్షణ తరువాత తన తుపాకీతో బదులు చెప్పి దేశం ఒడిలో ఒరిగిన ఒక యోధుడు ఉదం సింగ్.

షేర్ సింగ్ (ఉధం సింగ్) 1899 డిసెంబర్ 26 న పంజాబ్ లో సంగ్రూర్ జిల్లా సునం అనే గ్రామంలో కాంబొజి సిక్ కుటుంబంలో జన్మించారు. తండ్రి తెహల్ సింగ్ పొరుగు గ్రామమైన ఉపాల్‌లో జమ్ము రైల్వే క్రాసింగ్ కాపలాదారుగా జీవనం సాగించేవారు. ఉదం సింగ్ తల్లి 1901లో తండ్రి 1907లొ చనిపొయారు. షేర్ సింగ్ (ఉధం సింగ్ ) వారి తల్లి తండ్రులు చనిపోయాక అన్న ముక్తా సింగ్ తో కలిసి అమృత్ సర్ లో సెంట్రల్ ఖల్సా అనాథ ఆశ్రమంలో చేరారు. అక్కడ సిక్కులకి మతపరమైన దీక్ష చేసి అక్కడ వారి చేత ఉదం సింగ్ అనే పేరుని స్వీకరించారు. మెట్రిక్యులేషన్ చదువు 1918లో పూర్తి చేసి 1919లొ ఆ అనాథ ఆశ్రమం నుండి బయటకి వచ్చారు.

జలియన్ వాలా భాగ్ మారణ కాండ

పంజాబ్ అమృత్ సర్ లోని 1919 ఏప్రిల్ 13 న జలియన్ వాలా భాగ్ లో శాంతియుతంగా వేల మంది సామన్య పౌరులు సమావేశం అయి ఉండగా పోలీసులతో చుట్టుముట్టి విచ్చలవిడిగా కాల్పులు జరిపి వేల మంది మరణానికి కారణం అయ్యాడు జనరల్ డైయర్. ఈ అమానుష దాడి తన కళ్ళ ముందే జరగడంతో చలించిపొయిన ఉధం సింగ్ దేశానికి స్వాతంత్ర సాధన కోసం విప్లవ పంథా ఎంచుకున్నాడు. జలియన్ వాలా భాగ్ ఘటన అనంతరం అమెరికా వెళ్ళిన ఉద్దం సింగ్ అక్కడ గద్దార్ విప్లవ కారుల గురించి అలాగే బబ్బార్ అకాలీ విప్లవం గురించి తెలుసుకుని ప్రభావితుడు అయ్యాడు.

పూర్తిగా విప్లవ భావాలకి ఆకర్షితుడైన ఉద్దం సింగ్ 1927లో విదేశాలనుండి తుపాకులు తెస్తూ అమృత్ సర్ లో పొలీసులకి దొరికి 1931 వరకు జైలు జీవితం గడిపాడు. జైలు నుండి విడుదల అయిన అనంతరం అదే ఏడు మార్చ్ లో ఉరికంబం ఎక్కిన విప్లవ జ్యోతిని రగిల్చిన భగత్ సింగ్ ను తన గురువుగా భావించడం మొదలుపెట్టి పోలీసుల నిఘా నుండి తప్పించుకుని కాశ్మీర్ ,జర్మని మీదగా లండన్ చేరాడు. 1935 లో, అతను కాశ్మీర్ సందర్శించినప్పుడు, భగత్ సింగ్ చిత్రపటాన్ని సంపాదించి తన దగ్గరే భద్రపరుచుకున్నాడు.

జలియన్ వాలా భాగ్ మారణ హోమానికి కారణమైన జలనరల్ డైయ్యర్ ని హత్య చేయడానికి పగబట్టి 9 సంవత్సరాలు ఎదురు చూసి 21 సంవత్సరాల తరువాత 13 మార్చ్ 1940 న లండన్ కాక్స్ టన్ హాల్ లో డయర్ ని అందరు చూస్తుండగానే తుపాకీతో కాల్చి హత్య చేసి ప్రతీకారం తీర్చుకుని పోలీసులకి స్వచ్చందంగా పట్టుబడి తను చంపిన కారణాన్ని నిర్భయంగా చెప్పాడు. దీంతో జూన్ 4, 1940 న, ఓల్డ్ బెయిలీలోని సెంట్రల్ క్రిమినల్ కోర్టులో, జస్టిస్ అట్కిన్సన్ , అతను మరణశిక్ష విధించాడు. జూలై 31,1940 న, ఉధమ్ సింగ్‌ను లండన్‌లోని పెంటన్‌విల్లే జైలులో ఉరి తీసారు.

ఉరి కంబం ఎక్కుతు 9 సంవత్సరాల ముందు చనిపోయిన నా మిత్రుడిని కలుసుకోబోతున్నందుకు అనందం గా ఉంది అని పరోక్షంగా భగత్ సింగ్ ని తలుచుకున్నాడు -- డయర్ ని చంపిన తరువాత పోలీసులకి తన పేరును మహమద్ సింగ్ ఆజాద్ అని చెప్పి తన మత సామరస్యాన్ని చూపాడు ఉదం సింగ్. ఉరితరువాత తన అస్తికలను తిరిగి తన దేశానికి పంపమని ఉధమ్ సింగ్ ఒక అభ్యర్థన చేసినప్పటికీ బ్రిటీష్ ప్రభుత్వం దానికి అనుమతించలేదు. అయితే స్వాతంత్రం అనంతరం అయన అమరుడైన 34 ఏళ్ళ తరువాత 1975 జులై 19న భారత ప్రభుత్వం చూపిన చోరవతో ఆ విప్లవ తేజం అస్తికలను తీసుకు వచ్చి అతని ఆఖరి కోరిక తీర్చారు. నేడు ఉదం సింగ్ 80వ వర్ధంతి సందర్భంగా ఆ యోధుడిని స్మరిస్తు....

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp