టి.టి.డి సప్తగిరి మాస పత్రిక చీఫ్ ఎడిటర్ , సబ్ ఎడిటర్ పై సస్పెన్షన్ వేటు.

By Krishna Babu Jun. 05, 2020, 10:53 pm IST
టి.టి.డి సప్తగిరి మాస పత్రిక చీఫ్ ఎడిటర్ , సబ్ ఎడిటర్ పై సస్పెన్షన్ వేటు.

ఎట్టకేలకు సప్తగిరి మాస పత్రికలో ప్రచురితమైన వ్యాసం పైన చెలరగిన వివాదం సద్దుమణిగింది. రామాయణంలో సీతకు లవుడు మాత్రమే కుమారుడని, కుశుడు దర్బతో రాసిన బొమ్మ అంటూ ప్రచురితమైన వ్యాసంతో కొందరు భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన టి.టి.డి అధికారులు ఈ వ్యవహారం పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని కోరగా , రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు సప్తగిరి పత్రిక ఎడిటర్ రాధా రమణ, సబ్ ఎడిటర్‌లను విచారించారు.

అయితే విజిలెన్స్ అధికారుల విచారణలో 2016లో నిషేధించిన కుశుడు ఆర్టికల్ ను టి.టి.డి కి చెడ్డపేరు తేవాలి అనే దురుద్దేశంతోనే 9వ తరగతి విధ్యార్ధి పేరున ప్రచురించారని వెల్లడవ్వడంతో నివేదిక ఆదారంగా పత్రిక చీఫ్ ఎడిటర్ , సబ్ ఎడిటర్ పై సస్పెన్షన్ వేటు వేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న వైవీ సుబ్బారెడ్డి టి.టి.డీ కు సంభందించి ఎటువంటి కుట్రపూరిత చర్యలు చేపట్టిన ఉపేక్షించబోమని హెచ్చరించారు.

తిరుమలలో ఇటీవల చిన్న చిన్న అంశాలను కూడా వివాదాస్పదంగా మారుస్తూ ఉండడం ఆసక్తిగా మారుతోంది. కొన్ని కల్పనలు కూడా కలకలం రేపుతున్నాయి. టీటీడీ బస్సు టికెట్లపై ఇతర మతాల ముద్రలు, తిరుమల కొండపై శిలువ నిర్మాణం వంటి అర్థసత్యాలు కూడా అలానే వివాదాలకు మూలం అయ్యాయి. ఇక టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సంబంధించిన మతం మీద కూడా కొందరు దుష్ప్రచారం చేసి దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల టీటీడీ భూముల అమ్మకాల విషయంలో 2016 నాటి నిర్ణయాన్ని అమలు చేయడం కూడా నేరమే అన్నట్టుగా అప్పట్లో నిర్ణయం చేసిన వాళ్లే వ్యాఖ్యానించడం గమనిస్తే తిరుమల చుట్టూ ఉద్దేశపూర్వకంగా సాగుతున్న రాజకీయాలు అర్థమవుతాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp