రెండోసారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్

By Rishi K Jan. 14, 2021, 07:13 am IST
రెండోసారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా రికార్డు నెలకొల్పారు. ఈనెల 6న వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌ భవనంలో అమెరికా కాంగ్రెస్‌ సమావేశమైన విషయం తెలిసిందే. కాగా జో బైడెన్ గెలుపును వ్యతిరేకిస్తూ వస్తున్న ట్రంప్‌ మద్దతుదారులు పెద్దఎత్తున్న క్యాపిటల్‌ భవనాన్ని చుట్టుముట్టడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించడంతో ట్రంప్ పై వ్యతిరేకత బాగా పెరిగింది.

డొనాల్డ్ ట్రంప్ కావాలనే తన మద్దతుదారులను క్యాపిటల్ భవనంపై దాడికి పాల్పడేలా ప్రోత్సహించారని వార్తలు వెలువడ్డాయి. దీన్ని కారణంగా పేర్కొంటూ డెమొక్రాట్లు ట్రంప్‌పై ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ట్రంప్ సొంత పార్టీ సభ్యులు కొందరు ట్రంప్ అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటేయడం గమనార్హం. కాగా మరో వారం రోజుల్లో ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి దూరం కానుండగా ఈ నెల 20 నుండి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ట్రంప్ పై విచారణ జరగనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp