గెలుపు గులాబీదే..!

By Kalyan.S May. 02, 2021, 03:43 pm IST
గెలుపు గులాబీదే..!

తెలంగాణ‌లో ఉప ఎన్నిక ఫ‌లితం తేలిపోయింది. నాగార్జున‌సాగ‌ర్ లో గులాబీనే గెలుపు వ‌రించింది. నోముల న‌ర్సింహ‌య్య కుమారుడు భ‌గ‌త్ ఎమ్మెల్యే అయ్యారు. 18, 449 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు.

టీఆర్ఎస్ శ్రేణులు మొద‌టి నుంచి చెబుతున్న‌ట్లుగా 20 వేల మెజారిటీకి చేరువ అయ్యారు. టీఆర్ఎస్ అధినేత కె.చంద్ర‌శేఖ‌రరావు వ్యూహాలు ఫ‌లించాయి. అభ్య‌ర్థి ఎంపిక నుంచి గెలుపొందే వ‌ర‌కూ ఆయ‌న ప్ర‌తీ రోజూ ఎన్నిక‌ల స‌ర‌ళిని నిశితంగా గ‌మనిస్తూ శ్రేణుల‌కు దిశా నిర్దేశం చేస్తూ వ‌చ్చారు. ఉప ఎ న్నిక అయిన‌ప్ప‌టికీ ఏకంగా రెండు సార్లు ఎన్నిక‌ల స‌భ‌లో పాల్గొన్నారు. మొద‌టి నుంచీ కాంగ్రెస్ టార్గెట్ గానే టీఆర్ఎస్ ప్ర‌చారం సాగింది. చివ‌ర‌కు కాంగ్రెస్ అభ్య‌ర్థి, సీనియ‌ర్ నాయ‌కుడు జానారెడ్డిపై, రాజ‌కీయాల్లో జూనియ‌ర్ అయిన నోముల భగ‌త్ విజ‌యం సాధించారు. 25 రౌండ్లు ముగిసే స‌రికి టీఆర్ఎస్ కు మొత్తం 87, 254 ఓట్లు పోల‌వ్వ‌గా, కాంగ్రెస్ కు 68, 714 ఓట్లు, బీజేపీకి కేవ‌లం 7,159 మాత్ర‌మే వ‌చ్చాయి.
మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కూ త‌గ్గ‌ని జోరు..

ఉద‌యం 8 గంట‌ల‌కు కౌంటింగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచీ టీఆర్ఎస్ ఆధిక్య‌త క‌న‌బ‌రిచింది. పోస్ట‌ల్ బ్యాలెట్ నుంచి చివ‌రి రౌండ్ వ‌ర‌కూ ఆ పార్టీ అభ్య‌ర్థి భ‌గ‌త్ ముందంజ‌లో ఉన్నారు. కేవ‌లం ఒకే ఒక్క రౌండ్ లో మాత్ర‌మే కాంగ్రెస్ స్వ‌ల్ప ఆధిక‌త్య‌ను సాధించింది. తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 4228 ఓట్లు, కాంగ్రెస్‌కు 2753 ఓట్లు వచ్చాయి. 1475 ఓట్ల ఆధిక్యంలో భగత్ నిలిచారు.

రెండో రౌండ్‌లో ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌. 2216 ఓట్లతో నోముల భగత్‌ ముందంజలో ఉన్నారు. మూడో రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌కు 3421, కాంగ్రెస్‌కు 2882 ఓట్లు రాగా, 2,665 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. నాలుగో రౌండ్‌లో 3457 ఓట్లు, ఐదో రౌండ్‌ ముగిసేసరికి 4334 ఓట్లు, ఆరో రౌండ్ ముగిసే సరికి 5177 ఓట్లు, ఏడో రౌండ్‌ ముగిసేసరికి 6,592 ఓట్లు, ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 7948 ఓట్ల ఆధిక్యంలో కొనాస‌గింది. పదో రౌండ్‌ ముగిసేసరికి 7,963 ఓట్ల ఆధిక్యంలో, 11వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 9106 ఓట్ల ఆధిక్యంలో ఉంది. వరుసగా 12వ రౌండ్‌లో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ ముందంజలో దూసుకుపోయింది. 10,361 ఓట్ల ఆధిక్యంలో భగత్ నిలిచారు. 13వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 10581 ఓట్ల ఆధిక్యంలో ఉండ‌గా, జానారెడ్డి 14వ రౌండ్‌లో స్వ‌ల్ప ఆధిక‌త్య సాధించ‌డంతో టీఆర్‌ఎస్ ఆధిక్య‌త‌ కాస్త త‌గ్గింది. 9498 ఓట్ల ఆధిక్యానికి చేరింది. 15వ రౌండ్‌లో 416 ఓట్ల లీడ్ సాధించి 9914 ఓట్ల ఆధిక్యానికి చేరుకుంది.

- 16వ రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ పార్టీ 10158 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్‌ టీఆర్‌ఎస్‌కు 3475, కాంగ్రెస్‌కు 3231ఓట్లు వచ్చాయి. 16వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ లీడ్ 244 ఓట్లు.

- 17వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 11581 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 17వ రౌండ్లో టీఆర్‌ఎస్‌కు 3772, కాంగ్రెస్‌కు 2349 ఓట్లు వచ్చాయి. 16వ రౌండ్లో టీఆర్‌ఎస్‌ లీడ్ 1423 ఓట్లు.

- 18వ రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ 13396 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 18వ రౌండ్లో టిఆర్‌ఎస్‌కు 4074, కాంగ్రెస్‌కు 2259 ఓట్ల వచ్చాయి. 18వ రౌండ్లో టీఆర్‌ఎస్‌ లీడ్ 1851 ఓట్లు.

- టీఆర్‌ఎస్‌ పార్టీ తిరుగులేని ఆధిక్యంలో దూసుకుపోతుంది. 19వ రౌండ్ ముగిసేసరికి టీఆర్‌ఎస్‌ 14476 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 3732, కాంగ్రెస్‌కు 2652 ఓట్లు వచ్చాయి. 18వ రౌండ్లో టీఆర్‌ఎస్‌ లీడ్ 1080 ఓట్లు.

- 20వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 15070 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 3740, కాంగ్రెస్‌కు 3146 ఓట్లు వచ్చాయి. 20వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ లీడ్ 594 ఓట్లు

- 21వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ 15,522 ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్‌లో కాంగ్రెస్ 3011, టీఆర్‌ఎస్‌కు 3463 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 452 ఓట్ల లీడ్‌లో ఉంది.

- 22వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 16765 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 3783, కాంగ్రెస్‌ 2540 ఓట్లు వచ్చాయి. 22వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ లీడ్ 1243 ఓట్లు.

- 23 వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 849 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తం టీఆర్‌ఎస్‌ పార్టీ17,61 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

- 24వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 18414 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 3312, కాంగ్రెస్‌కు 2512 ఓట్లు వచ్చాయి. 24వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ లీడ్ 800 ఓట్లు

- 25వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 18449 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్లో టీఆర్‌ఎస్‌కు 2443, కాంగ్రెస్‌కు 2408 ఓట్లు వచ్చాయి. 25వ రౌండ్లో టీఆర్‌ఎస్‌ లీడ్ 35 ఓట్లు.

Also Read : తిరుప‌తి బై పోల్ : టీడీపీ ఆశ‌లు గ‌ల్లంతే..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp