గ్రేటర్ టీఆర్ఎస్ గెలిచేస్తుందా.. ? ఆ పార్టీకి 65 సీట్లు చాలు.. !

By Voleti Divakar Nov. 21, 2020, 10:30 am IST
గ్రేటర్ టీఆర్ఎస్ గెలిచేస్తుందా.. ? ఆ పార్టీకి 65 సీట్లు చాలు.. !

గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో నామినేషన్ల పర్వం, ఉపసంహరణల పర్వం, ఏకగ్రీవాల పర్వం జరగకుండానే టిఆర్ఎస్ పార్టీ సగం గెలిచిందా.?. గ్రేటర్ లో మొత్తం 150 డివిజన్లు ఉండగా, గత ఎన్నికల్లో టిఆర్ఎస్ 99 డివిజన్లు గెలిచి గ్రేటర్ పీఠం కైవసం చేసుకుంది. ప్రస్తుతం. కూడా తామే గెలుస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతికూల పరిస్తితులు ఎదురైనా ఎక్స్ అఫిషియో సభ్యుల అండే వారి ధీమాకు కారణం.

జీహెచ్ఎంసి మేయర్ ఎన్నికల్లో జీహెచ్ఎంసి పరిధిలోని 24 మంది ఎమ్మెల్యే లు, 5 మంది లోక్ సభ సభ్యుల ఎక్స్-ఆఫీషియో మెంబర్లు అవుతారు. వీరితో పాటు జీహెచ్ఎంసి పరిధిలో ఓటు ఉన్న రాజ్యసభ మరియు ఎమ్మెల్సీ లకు కూడా ఎక్స్-ఆఫీషియో మెంబర్లుగా "నమోదు" చేసుకునే హక్కు ఉంటుంది,అయితే దానికి పలు నిబంధనలు ఉన్నాయి.

ఈ ఎన్నికల్లో 58 మంది ఎక్స్-ఆఫీషియో మెంబర్లు ఉంటారని అంచనా. మేయర్ ఎన్నిక ముందు ఎన్నికల సంఘం ఎక్స్-ఆఫీషియో మెంబర్లు లిస్ట్ ను ప్రకటిస్తుంది. జీహెచ్ఎంసి పరిధిలోని 24 ఎమ్మెల్యే స్థానాలలో పార్టీల బలం 16 తెరాస,7 ఎంఐఎం ,1 బీజేపీ. ఐదు లోక్ సభ సభ్యులలో చేవెళ్ల మరియు మెదక్ తెరాస,సికింద్రాబాద్ బీజేపీ,మల్కాజ్ గిరి కాంగ్రెస్ మరియు హైద్రాబాద్ ఎంఐఎం . అంటే ఈ 29 ఎక్స్-ఆఫీషియో ఓట్లలో పార్టీల బలాబలాలు తెరాస కు 18,ఎంఐఎం 8,బీజేపీ 2,కాంగ్రెస్ 1.

తెలంగాణలో ఏడూ రాజ్యసభ స్థానాలు ఉండగా ఏడూ తెరాస కు చెందిన నేతలే ఉన్నారు. అయితే వీరిలో డి.శ్రీనివాస్ ఘాట్ కొంత కాలంగా తెరాస కు దూరంగా ఉంటున్నాడు. మిగిలినా ఆరుగురిలో కేశవరావు,సంతోష్ కుమారులు హైద్రాబాద్ సిటీ లో ఓటుహకు ఉన్నవారే. మిగిలిన ముగ్గురు ఎక్స్-ఆఫీషియో మెంబర్లుగా నమోదు చేసుకున్నారో లేదో తెలియాలి. అంటే రాజసభ కోటాలో గరిష్టంగా తెరాస కు ఆరు ఎక్స్-ఆఫీషియో ఓట్లు దక్కుతాయి. దీనితో ఎమ్మెల్యే మరియు పార్లమెంట్ సభ్యుల కోటాలో తెరాస కు గరిష్టంగా (రాజసభ సభ్యులందరు ఇక్కడే ఎక్స్-ఆఫీషియో మెంబర్లుగా నమోదు చేసుకుంటే) 24,బీజేపీ 2,ఎంఐఎం 8,బీజేపీ 2,కాంగ్రెస్ 1 ఎక్స్-ఆఫీషియో ఓట్లు దక్కుతాయి.

స్థానిక సంస్థల కోటాలో మెదక్ జిల్లా నుంచి ఒకరు ,రంగారెడ్డి మరియు హైద్రాబాద్ జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీ లకు ఎక్స్-ఆఫీషియో మెంబర్లుగా రిజిస్టర్ చేసుకోవటానికి అవకాశం ఉంది. హైద్రాబాద్ జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్సీ లు సహజంగా జీహెచ్ఎంసి లో ఎక్స్-ఆఫీషియో మెంబర్లు అవుతారు కానీ మెదక్ మరియు రంగారెడ్డి జిల్లాల నుంచి గెలిచినవారు ఆయా జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలలో ఎక్స్-ఆఫీషియో మెంబర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. కానీ తెరాస అందరిని జీహెచ్ఎంసి లోనే ఎక్స్-ఆఫీషియో మెంబర్లుగా నమోదు చేయించవచ్చు.

అదేవిధముగా మహబూబ్ నగర్-హైద్రాబాద్-రంగారెడ్డి నుంచి గ్రాడ్యుయేట్స్ ,టీచర్ల కోటాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్సీలకు ఎక్స్-ఆఫీషియో మెంబర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా స్థానిక సంస్థలు,గ్రాడ్యుయేట్స్ ,టీచర్ల కోటాలలో ఏడుగురు ఎమ్మెల్సీ లు జీహెచ్ఎంసి లోనే ఎక్స్-ఆఫీషియో మెంబర్లుగా నమోదు చేయించవచ్చు. ఈ కోటాలో తెరాస బలం 4,ఎంఐఎం 1,బీజేపీ 1 మరియు ఒక ఇండిపెండెంట్ .

ఎమ్మెల్యే కోటాలో 14 మంది ఎమ్మెల్సీలు ఉండగా 13 మంది తెరాస,ఒకరు ఎంఐఎం . గవర్నరుకోటాలో ఆరు మంది ఎమ్మెల్సీలు ఉండగా అందరు తెరాస ప్రభుత్వం నామినేట్ చేసినావారే కాబట్టి వారు తెరాస వైపే మొగ్గు చూపొచ్చు.

జీహెచ్ఎంసి పరిధి బయట గెలిచిన ఎమ్మెల్సీ లు వారి ఓటు జీహెచ్ఎంసి లో ఉంటే ఇక్కడ ఎక్స్-ఆఫీషియో మెంబర్లుగా నమోదు చేయించుకోవచ్చు. తెరాస కనుక అందరు ఎమ్మెల్సీ లనుజీహెచ్ఎంసి పరిధిలో ఎక్స్-ఆఫీషియో మెంబర్లుగా నమోదు చేస్తే ఎమ్మెల్సీ కోటాలో తెరాస కు గరిష్టంగా 23,ఎంఐఎం 1,బీజేపీ 1 దక్కే అవకాశం ఉంది.

అన్ని కలుపుకొని గరిష్టంగా 24 ఎమ్మెల్యే,5 లోక్ సభ,7 రాజ్యసభ,27 ఎమ్మెల్సీ ,మొత్తంగా 63 ఎక్స్-ఆఫీషియో మెంబర్లుగా నమోదు చేసుకోవటానికి అవకాశం ఉంది. దీని అదనంగా నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు ఉంది కానీ ప్రస్తుతం అది ఖాళీగా ఉంది.

ఇప్పటికున్న సమాచారం మేరకు ఎక్స్-ఆఫీషియో మెంబర్ల సంఖ్య 52 నుంచి 54 మధ్య ఉండబోతుంది. అందులో తెరాస బలం 39 నుంచి 41 కాగా ఎంఐఎం 9 బీజేపీ 3,కాంగ్రెస్ 1.

ఎక్స్-ఆఫీషియో మెంబర్లు 52 ఐతే మేజిక్ ఫిగర్ 102 అవుతుంది. అదే 58 మంది అయితే మేజిక్ ఫిగర్ 104 అవుతుంది. తెరాస బలం 39 నుంచి 41గా ఉండే అవకాశం ఉంది కాబట్టి.. మేయర్ పీఠాన్ని గెలిచేందుకు ఇంకా 65 లేదా 63 మంది కార్పొరేటర్లు నెగ్గితే చాలు. ఒకవేళ ఇంతకన్నా తక్కువ సీట్లు తెరాస కు వస్తే.. ఎంఐఎం తో పొత్తు పెట్టుకునే అవకాశాలను కొట్టిపారేయలేం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp