మ‌హాన‌గ‌రంలో ఆక్ర‌మ‌ణ‌ల ప్ర‌కంప‌న‌లు

By Kalyan.S Oct. 17, 2020, 09:30 pm IST
మ‌హాన‌గ‌రంలో ఆక్ర‌మ‌ణ‌ల  ప్ర‌కంప‌న‌లు

వ‌ర్షం వ‌చ్చిన ప్ర‌తిసారీ న‌గ‌రం మునిగిపోవ‌డం.. ఆక్ర‌మ‌ణ‌లే ఇందుకు కార‌ణ‌మని వార్త‌లు వెల్లువెత్త‌డం.. ప్ర‌జాప్ర‌తినిధులు రంగంలోకి దిగి ఆక్ర‌మ‌ణ‌ల కూల్చివేత‌ల‌కు ఆదేశాలివ్వ‌డం.. మామూలే అయినా ఈ సారి స‌ర్కార్ సీరియ‌స్ గా దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు కూడా మ‌ళ్లీ ఆక్ర‌మ‌ణ‌ల అంశం తెర‌పైకి వ‌చ్చింది. వ‌రుస‌గా కురుస్తున్న వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ లో వ‌ర‌ద బీభ‌త్సం గురించి తెలిసిందే. ఈ క్ర‌మంలో మంత్రి కేటీఆర్ న‌గ‌ర‌మంతా ప‌ర్య‌టించారు. ప‌లు ప్రాంతాల్లో ముంపున‌కు కార‌ణం అక్ర‌మ నిర్మాణాలే అని గుర్తించారు. నాలాల‌పై ఆక్ర‌మ‌ణ‌ల‌ను కూల్చివేయాల‌ని స్థానిక అధికారుల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అంద‌రూ రంగంలోకి దిగారు.

మ‌ల్కాజిగిరి నుంచి మొద‌లు..

మంత్రి కేటీఆర్ ఆదేశాల మేర‌కు మ‌హాన‌గ‌రంలో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌ల ప‌ర్వం మొద‌లైంది. మ‌ల్కాజిగిరిలో నాలాల‌పై నిర్మాణాల‌ను కూల్చివేస్తున్నారు. ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు ద‌గ్గ‌రుండి కూల్చివేత ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. స‌ర్దార్ ప‌టేల్ న‌గ‌ర్ లోని నాలాపై ఉన్న నిర్మాణాన్ని కూల్చివేశారు. అలాగే ఇటీవ‌ల ప్ర‌మాదానికి కార‌ణ‌మైన ఓ భారీ ప్రాజెక్ట్ కు తాళం వేయించారు. అన్నీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఉన్నాయో.. లేదో ప‌రిశీలించాల‌ని టౌన్ ప్లానింగ్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ప‌నులు ప్రారంభించాల‌ని ఆదేశించారు. మ‌ల్కాజిగిరితో మొద‌లైన ఈ ఆక్ర‌మ‌ణ‌లు త్వ‌ర‌లో న‌గ‌ర‌మంతా ప్రారంభం అవుతాయ‌ని అధికారులు చెబుతున్నారు.

ముత్తాత‌ల ఆస్తులు అమ్మి రూ. 20 కోట్లు ఇస్తా..

నాలాలపై ఉన్న ఆక్ర‌మ‌ణ‌ల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్న ఎమ్మెల్యే మైనంప‌ల్లి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. బాధితుల‌కు ప్ర‌భుత్వం అందించే ప‌రిహారంతో పాటు త‌న తాత‌, ముత్తాల ఆస్తుల‌ను అమ్మి స్వ‌యంగా రూ. 20 కోట్లు బాధితుల‌కు అంద‌జేస్తాన‌ని హామీ ఇచ్చారు. అలాగే రేప‌టి నుంచి మైనంప‌ల్లి సోష‌ల్ స‌ర్వీస్ ఆధ్వ‌ర్యంలో ముంపు ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా అన్ని ప్రాంతాల‌లోనూ త‌గిన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. వైద్య శిబిరాల‌ను ఏర్పాటు చేసిన ప్ర‌జ‌ల‌కు మందులు ఇవ్వ‌డంతో పాటు త‌గిన జాగ్ర‌త్త‌లు తెలియ‌జేస్తామ‌న్నారు. ప్ర‌జ‌లంద‌రూ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని, అక్ర‌మ నిర్మాణ‌ల‌ను ప్రోత్స‌హించొద్ద‌ని సూచించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp