రైళ్లు నడపడంపై కేంద్రం కీలక నిర్ణయం

By Voleti Divakar Aug. 10, 2020, 10:15 pm IST
రైళ్లు నడపడంపై కేంద్రం కీలక నిర్ణయం

దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా వచ్చేనెల 30వ తేదీ వరకు ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు మినహా మిగిలిన రైళ్లన్నంటినీ రద్దు చేశారు. ఈ మేరకు భారతీయ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.

మార్చిలో లాక్ డౌన్ నాటి నుంచి దేశంలో రైళ్ల రాకపోకలపై పూర్తిస్థాయిలో నిషేధాన్ని అమలు చేస్తున్నారు. తొలిదశలో లాక్ డౌన్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిక్కుకునిపోయిన వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులను తరలించేందుకు రైల్వేశాఖ శ్రామిక్ రైళ్లను నడిపింది. ఆ తరువాత దేశవ్యాప్తంగా సుమారు 200 రైళ్లను మాత్రమే నడుపుతున్నారు. రైల్వే టైంటేబుల్ ప్రకారం నడిచే మిగిలిన అన్ని ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైళ్లను రద్దు చేశారు. ఈరైళ్ల రద్దును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేశంలో సాధారణ ప్రయాణాలు వచ్చే దసరా పండుగ వరకు పూర్తిస్థాయిలో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు.

శానిటైజర్లు తయారుచేసిన రైల్వే ఉద్యోగులు ..

విజయవాడ డివిజన్ పరిధిలోని రైల్వే ఉద్యోగుల వినియోగార్థం ఉద్యోగులు 45వేల మాస్కులు, 6500 లీటర్ల శానిటైజరును తయారుచేశారు. కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో విజయవాడ, కాకినాడ మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో పనిచేసే సిబ్బంది వీటిని తయారుచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రైల్వే సిబ్బంది తయారుచేసిన శానిటైజర్లు, మాస్కులను రైల్వేలోని వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తున్నారు. కరోనా అంతమయ్యే వరకు వీటి తయారీని కొనసాగిస్తామని రైల్వే వర్గాలు తెలిపాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp