ఏపీలో తెరుచుకోనున్న పర్యాటక ప్రాంతాలు

By Krishna Babu Aug. 02, 2020, 01:56 pm IST
ఏపీలో తెరుచుకోనున్న పర్యాటక ప్రాంతాలు
రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో వీలు చూసుకుని వారం రోజుల్లో పర్యాటకులకు అనుమతి ఇవ్వబోతునట్టు నిర్ణయం తీసుకునట్టు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతు రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాలన్నిటిని అందుబాటులోకి తెస్తునట్టు, అలాగే టూరిజం హోటల్లను కూడా తెరవబోతునట్టు , ఆగస్టు 15నుంచి అన్ని చోట్ల నుంచి తిరిగి బోట్లు తిరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు టూరిస్ట్ బస్సులని కుడా సిద్దం చేస్తునట్టు వెళ్ళడించారు.

రాబోయే రోజుల్లో టెంపుల్ టూరిజాన్ని మరింత అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుటున్నట్టు దానికి తగ్గ ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు ప్రసాద్ స్కీం ద్వారా సింహాచలం దేవస్థానాన్ని అభివృద్ది చేయబోతున్నట్టు ఇకపై రాష్ట్రంలో టూరిజం ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో మరింత అభివృద్ది చెందుతుందనే నమ్మకం తమకి ఉందని దానికి తగ్గ కార్యాచరణ కూడా సిద్దంగా ఉందని చెపుకొచ్చారు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp