చంద్రబాబు కు తిరుపతి గ్రాండ్ ఫెయిల్!

By Mavuri S Apr. 08, 2021, 07:40 pm IST
చంద్రబాబు కు తిరుపతి గ్రాండ్ ఫెయిల్!

ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల్లో దాదాపు హాండ్స్ అప్ అయిపోయిన తెలుగుదేశం పార్టీ కాస్తో కూస్తో చంద్రబాబు పర్యటన తో అయినా ఊపు వస్తుందని భావించింది. అయితే తిరుపతి చంద్రబాబు ప్రచారం గ్రాండ్ ఫెయిల్ అయినట్లు ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు.

మొదటి రోజు తిరుపతి ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టి తర్వాత శ్రీవారి దర్శనానికి వెళ్లిన చంద్రబాబు కొండ దిగి తిరుపతి కి రాగానే ఆయనకు కనీసం స్వాగతం చెప్పే నాయకులు లేకపోయారు. తిరుపతిలో కనీసం తెలుగు యువత నాయకుల జోష్ కనిపించలేదు. ద్వితీయ శ్రేణి నాయకులు ఇద్దరూ చంద్రబాబుకు స్వాగతం చెప్పి మహిళలతో హారతి పట్టించి మమా అనిపించారు. కనీసం చంద్రబాబు కాన్వాయ్ ను అనుసరించి ఒక ర్యాలీ చేసిన పాపాన పోలేదు.

తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఎక్కడ పర్యటించాలి అనే దానిమీద తెలుగుదేశంలో తర్జనభర్జన జరుగుతుంది. ఏ ప్రాంతంలో చంద్రబాబు పర్యటిస్తే పార్టీకి లాభం అన్న విషయం మీద ఎవరికి స్పష్టత లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీంతో ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన ఎప్పుడు పెట్టాలి అన్న దానిమీద నియోజకవర్గ నేతలు తలోమాట మాట్లాడుతున్నారు.

చంద్రబాబు ప్రచారానికి రాకమునుపే ఆయన తనయుడు లోకేష్ బాబు తిరుపతి లోనే ఉండి ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రసంగం మొదలు పెట్టగానే కాస్త ఆగి చూద్దాం అనుకున్న వారు సైతం వెళ్లిపోతున్నారు అని, ఆయన చెప్పే మాటల వల్ల ప్రత్యర్థి వర్గాల ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. లోకేష్ ప్రచారం వల్ల వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉండటంతో ఆయన ప్రసంగాలు తగ్గించారు.

Also Read : మెచ్యూరిటీ పెరగాలి చినబాబు

చంద్రబాబుకు మొదటిరోజే తిరుపతిలో నాయకుల నుంచి అనుకున్న మద్దతు లభించలేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు టిడిపిలో ఉన్న నేతలు దాదాపు అంతా అధికార పార్టీ వైపు రావడంతో కేవలం ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే చంద్రబాబు పక్కన ఉన్నారు. ఉన్న నాయకులకు తిరుపతి లో సరైన పేరు లేకపోవడంతో వారు ప్రచారంలో కనిపిస్తే ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అన్న భయం టిడిపి వర్గాల్లో నెలకొంది.

తిరుపతి లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదట ఎక్కడికి వెళ్లాలి అన్నది చంద్రబాబుకు అంతుబట్టడం లేదు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాదులో తండ్రి వద్ద ఉంటున్నారు. బొజ్జల గోపాలకృష్ణ కు ఏ సమయంలో ఏమవుతుందోనని ఆందోళన ఆ కుటుంబంలో నెలకొంది. సత్యవేడు నియోజకవర్గ బాధ్యుడు జెడ్డా రాజశేఖర్ కు ఆ నియోజకవర్గంలో మంచి పేరు లేదు. దీంతో పాటు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన తలారి ఆదిత్య పార్టీకి దూరంగా జరుగుతున్నారు. పార్టీలోని ఇతర నేతల్లోనూ అసంతృప్తులు అక్కడ కనిపిస్తున్నాయి. సూళ్లూరుపేట లో పరసారత్నం జాడ కనిపించకపోవడంతో పాటు, గూడూరులో సునీల్ కుమార్ ప్రభావం పూర్తిగా కనుమరుగైంది.

ఇక మిగిలిన వెంకటగిరి, సర్వేపల్లి లో తిరిగినా పెద్దగా ఉపయోగం ఉండదనే అభిప్రాయం చంద్రబాబు లోనే ఉంది. దీంతో అసలు ప్రచారం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అన్న సందిగ్ధత ఆయనను వెంటాడుతోంది. కేవలం తిరుపతి అసెంబ్లీ కి చంద్రబాబు పరిమితమై ప్రచారం చేసుకుని వెళ్ళిపోతారా మిగిలిన నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే ప్రశ్న ఇటు కెడర్ లో, అటు నాయకత్వం లోనూ కనిపిస్తోంది.

Also Read : ఎన్నికల ప్రచారం.. నూతన ఒరవడికి వైఎస్‌ జగన్‌ శ్రీకారం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp