సాయిబాబా విగ్రహంతో రాజకీయాలకు సిద్ధమయిన బీజేపీ, జనసేన, టీడీపీ నేతలకు బుద్ధి చెప్పిన స్థానికులు

By Raju VS Sep. 17, 2020, 09:10 am IST
సాయిబాబా విగ్రహంతో రాజకీయాలకు సిద్ధమయిన బీజేపీ, జనసేన, టీడీపీ నేతలకు బుద్ధి చెప్పిన స్థానికులు

రాష్ట్రంలో మతానికి సంబంధించిన అంశాలతో మనుగడ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రజా సమస్యలను గాలికొదిలేసి మత సంబంధిత అంశాల చుట్టూ తిరగాలనే ఆలోచన పెరిగింది. అందుకు తగ్గట్టుగానే కొందరు నేతలు చిన్న చిన్న ఘటనలు కూడా భూతద్దంలో చూపించే ప్రయత్నానికి ఒడిగడుతున్నారు. తద్వారా ప్రజల్లో మతాల ఆధారంగా విద్వేషాలు రాజేసే ప్రయత్నం జరుగుతున్నట్టు అర్థమవుతోంది.

కొన్ని రాజకీయ పార్టీల ప్రయత్నాలను సామాన్యులు కూడా గ్రహించారు. సున్నితమైన అంశాలను వివాదం చేసే ప్రయత్నాలకు సహకరించేది లేదంటూ చెప్పేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు సాయిబాబా ఆలయంలో విగ్రహం ధ్వంసం అయ్యింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తలు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. నిందితులను వెంటనే గుర్తించాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈలోగా బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు అక్కడ వాలిపోయారు.

Read Also ;యోగి ఆదిత్యానంద్ సాహసం చేస్తున్నారా?

ముందుగా ఈ సమాచారం టీడీపీ మీడియాలో గోరింతలు కొండంతలు చేసే రీతిలో ప్రచారమయ్యింది. ఆ వెంటనే రాజకీయం చేసే లక్ష్యంతో అక్కడకు చేరిన నేతలకు చుక్కెదురయ్యంది. టీడీపీ నేతలనయితే స్థానికులు ఘటనా స్థలానికి కూడా రాకుండా అడ్డుకున్నారు. మా గ్రామంలో జరిగిన విషయం ఇది...మేమంతా సామరస్యంగా ఉంటాం. ఎవరో దుండుగులు చేసిన పని రాజకీయం చేయడం తగదంటూ ఆపార్టీ నేతలను నిలువరించారు. దాంతో చివరకు అక్కడే మీడియాతో మాట్లాడి టీడీపీ నేతలు వెనుదిరాగాల్సి వచ్చింది. దానికి ముందు జనసేన , బీజేపీ కార్యకర్తలు కొందరు ఆందోళనకు సిద్ధమయ్యారు. దాంతో స్థానికులు భగ్గుమన్నారు. తమ గ్రామ సమస్యను తామే పరిష్కరించుకుంటామని, రాజకీయంగా పెద్దది చేసే ప్రయత్నాలు కూడదని తేల్చిచెప్పేశారు. కొందరు ఆందోళనకారులు స్థానికులతో తగాదాకి దిగారు. దాంతో స్వల్పంగా తోపులాట కూడా జరిగింది. చివరకు గ్రామ పెద్దల జోక్యంతో ఆ రెండు పార్టీల శ్రేణులు కూడా వెనుదిరగాల్సి వచ్చింది.

Read Also; మరో టీడీపీ నేత కేసులో హైకోర్ట్ స్టే..

రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వరుస ఘటనలు జరుగుతున్న తీరు మీద అటు ప్రభుత్వంలో కదలిక మొదలయ్యింది. ఇటు ప్రజల్లో ఆలోచన సాగుతోంది. ఉద్దేశపూర్వకంగా సాగుతున్న ప్రయత్నాలని అనేక మంది గుర్తిస్తున్నారు. ఒక ఘటన జరగడం, ఆ వెంటనే కొందరు అక్కడ వాలిపోయి నిరసనలకు దిగడం, దానిపై సోషల్ మీడియాలో అర్థ సత్యాలు వైరల్ చేయడం వెనుక ఏదో శక్తి ఉందనే అనుమానం ప్రజల్లో కూడా ఉంది. దానికి అనుగుణంగానే నిడమానూరు ప్రజలు రాజకీయాలను అడ్డుకున్నట్టు కనిపిస్తోంది. ఏపీలో మత రాజకీయాలకు అవకాశం లేదని మరోసారి నిరూపించినట్టయ్యింది.

అంతేగాకుండా సాయిబాబా విగ్రహం ధ్వసం చేసిన విషయాన్ని అక్కడ పూలమ్మే వ్యక్తి పోలీసుల దృష్టికి తీసుకురాగా మధ్యాహ్నానికే ప్రత్యామ్నాయంగా కొత్త విగ్రహాన్ని సీఐ చొరవతో ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉండే మందుబాబుల మీద కొందరు అనుమానం వ్యక్తం చేయడంతో విచారణ సాగిస్తున్నారు. ఏమయినా సమస్యను స్థానికులు చూపిన చొరవతో పరిష్కరించుకోవడం ద్వారా మత సామరస్యం చాటిన తీరు ఆసక్తిగా మారింది.

Read Also ; సామాన్యుడికి కూడా ఈ హక్కు ఇస్తారా? హైకోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp