ఎన్నికలు స‌మీపిస్తున్న వేళ బీహార్ లో రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు

By Kalyan.S Sep. 03, 2020, 08:14 am IST
ఎన్నికలు స‌మీపిస్తున్న వేళ బీహార్ లో రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలైనజేడీయూ(జనతాదళ్, ఐక్య), ఎల్‌జేపీ(లోక్‌జనశక్తి పార్టీ)లతో క‌లిసి బీజేపీ త‌న వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. ఇప్ప‌టికే సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన ఆ పార్టీ కాంగ్రెస్ కూట‌మికి గ‌ట్టి షాక్ ఇస్తోంది.

తాజా ప‌రిణామాల‌తో పాటు బీజేపీ అనుస‌రిస్తున్న విధానాల‌తో హిందుస్తానీ అవామ్‌ మోర్చా(హెచ్‌ఏఎమ్‌) చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ అధికార ఎన్డీయే కూటమితో జట్టుకట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు 9 స్థానాల్లో పోటీచేసేందుకు వీలుగా ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఎన్డీయేలో భాగమైన జేడీయూ కోటా కింద 9 సీట్లు హెచ్‌ఏఎమ్‌కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన నేడు అధికారిక ప్రకటన విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామన్నారు.

జేడీయూను వీడి..

2015లో జేడీయూను వీడిన జితన్‌ రామ్‌ సొంతంగా హిందూస్తాన్‌ అవామ్‌ మోర్చా పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతాదళ్‌, కాంగ్రెస్‌ పార్టీ కూటమిలో చేరిన ఆయన ఆగష్టులో మహాఘట్‌బంధన్‌కు గుడ్‌ బై చెప్పారు. మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరుతుండటంతో.. ‘ఘర్‌ వాపసీ’కి రంగం సిద్ధమైందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇటీవ‌ల ఆయ‌న మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నితీశ్‌జీ తీసుకుంటున్న చర్యలు తమను ఆకర్షించాయని రిజ్వాన్‌ చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు సీట్ల కేటాయింపు విషయం పెద్ద సమస్యేమీ కాదని, ఎన్డీయేలో భాగస్వామ్యం కావడం ముఖ్యమన్నారు. ప్రతిపక్ష ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ కూటమి నుంచి వైదొలిగిన దాదాపు నెల రోజుల తర్వాత జితన్‌ రామ్‌ మాంఝీ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

శ‌ర‌ద్ కు కూడా ఆహ్వానం..?

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ(జనతాదళ్, ఐక్య), ఎల్‌జేపీ(లోక్‌జనశక్తి పార్టీ)లు ఐక్యంగానే బరిలోకి దిగుతాయని, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమారే సీఎం అభ్యర్థి అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇది వరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బిహార్‌లో కూడా ప్రతిపక్షం నిర్వీర్యమైందనీ, తామే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు జితన్‌ రామ్‌ మాంఝీతో పాటు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన జేడీయూ మాజీ నేత శరద్ యాదవ్‌ను కూడా తిరిగి ఆహ్వానించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని కోసం బీజేపీ ముఖ్య నేత‌లు ఇప్ప‌టికే రంగంలోకి దిగిన‌ట్లు స‌మాచారం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp