ఢిల్లీకి తొలి రైల్వే కార్గో ఎక్స్ ప్రెస్

By Voleti Divakar Aug. 06, 2020, 09:16 pm IST
ఢిల్లీకి తొలి రైల్వే కార్గో ఎక్స్ ప్రెస్

కరోనా కాలాన్ని రైల్వేశాఖ ప్రణాళికాబద్ధంగా సద్వినియోగం చేసుకుంటోంది. సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్లు పూర్తిస్థాయిలో నడపకపోవడంతో నూతనంగా కార్గో ఎక్స్ ప్రెస్ రైలును దక్షిణమధ్య రైల్వే ప్రారంభించింది. సాధారణ రైళ్లను పూర్తిస్థాయిలో నడిపే అవకాశాలు లేకపోవడంతో రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఆదాయం వైపు దృష్టిసారించినట్లు కనిపిస్తోంది. ఈరైలు ద్వారా 40శాతం తక్కువ వ్యయానికే సరుకు రవాణా చేసుకోవచ్చని రవాణాదారులు, పారిశ్రామిక సంస్థలకు విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్ సమీపంలోని సనత్ నగర్ నుంచి న్యూడిల్లీ సమీపంలోని ఆదర్శనగర్ వరకు ఈ కార్గో ఎక్స్ ప్రెస్ సరుకులు రవాణా చేస్తుంది.

భారతదేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన ఎక్స్ ప్రెస్ కార్గో రైలు ప్రతీ బుధవారం సనత్ నగర్ నుంచి బయలుదేరి సుమారు 50 కిలోమీటర్ల వేగంతో 48గంటల్లోనే డిల్లీకి చేరుతుందని అధికారులు వెల్లడించారు. ప్రయోగాత్మకంగా 6నెలల పాటు ఈ రైలును నడిపి, విజయవంతమైతే పూర్తిస్థాయిలో కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కార్గో ఎక్స్ ప్రెస్లో చిన్న స్థాయిలో కూడా సరుకులు రవాణా చేసే అవకాశాన్ని కల్పించారు.

సౌకర్యవంతమైన, వేగవంతమైన సరుకు రవాణా సదుపాయాన్ని కల్పించేందుకు కార్గో ఎక్స్ ప్రెస్ రైలుకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా సరుకు రవాణా గూడ్స్ రైళ్లు నిర్దేశిత గడువులోగా గమ్యస్థానాలకు చేరడం అరుదు. అయితే ఈ కార్గో ఎక్స్ ప్రెస్ టైం టేబుల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుతుండడం విశేషం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp