దేశంలో తొలి కరోనా మొబైల్ ఐసియు: హైదరాబాద్ రోడ్లపై చక్కెర్లు.

By iDream Post May. 22, 2020, 04:56 pm IST
దేశంలో తొలి కరోనా మొబైల్ ఐసియు: హైదరాబాద్ రోడ్లపై చక్కెర్లు.

దేశంలో తొలి కరోనా మొబైల్ ఐసియు వచ్చేసింది. హైదరాబాద్ రోడ్లపై చక్కెర్లు కొడుతుంది. దీన్ని ప్రజలు ఆసక్తితో చూస్తున్నారు.
హైదరాబాద్ కోఠిలోని డిఎంఈ కార్యాలయంలో కోవిడ్-19 మొబైల్ ఐసీయు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు.

హైదరాబాద్ నగరానికి చెందిన గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ ఈ మొబైల్ ఐసియును తయారు చేసింది. ఇందులో మూడు పడకలు, రెండు వెంటిలేటర్లతో పాటు ఐసియులో అవసరమైన అన్ని వసతులు ఉంటాయి. కరోనా మహామ్మారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలో విజృంభిస్తోన్న నేపథ్యంలో నగరంతో పాటు కోవిడ్ -19 సోకుతోన్న ప్రాంతాల్లో ఈ కరోనా ఐసియు మొబైల్ వాహనం అందుబాటులో ఉండనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp