Rule Of Law - చట్టం ముందు అందరూ సమానులే.. దటీజ్ జగన్..

By Balu Chaganti Oct. 23, 2021, 07:15 pm IST
Rule Of Law -  చట్టం ముందు అందరూ సమానులే.. దటీజ్ జగన్..

గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగదేశం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. గంజాయి పుట్టింది వైసీపీ అధికారంలోకి వచ్చాకే, వైసీపీ నేతలే గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అన్నట్లుగా పెద్ద ఎత్తున చర్చ మొదలు పెట్టారు.. విశాఖలో గంజాయి సాగు అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దానిని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది కూడా.. కానీ హెరాయిన్ వ్యవహారం మధ్యంతరంగా దర్యాప్తు సంస్థల కారణంగా మాట్లాడకూడని పరిస్థితులు రావడంతో ఇప్పుడు కొత్తగా గంజాయి పల్లవిని ఎత్తుకున్నారు తెలుగుదేశం నేతలు.. ఇదే వ్యవహారం మీద నక్కా ఆనంద్ బాబు అనుచిత వ్యాఖ్యలు చేయగా అందుకు తగిన ఆధారాలు చూపించమని విశాఖ జిల్లా పోలీసులు ఆనందబాబు  కు నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. రాత్రి సమయంలో కరెక్ట్ కాదని అనడంతో ఉదయాన్నే వెళ్లి పోలీసులకు నోటీసులు ఇవ్వడం కూడా జరిగాయి..

ఇదేదో తప్పుడు వ్యవహారం అన్నట్లుగా పట్టాభి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాక ఎవరూ మాట్లాడని విధమైన మాటలు మాట్లాడి పెను విధ్వంసానికి దారితీసేలా చేశారు. తమ అభిమాన నేతను ఏమైనా అంటే తట్టుకోలేని కొంత మంది పట్టాభి ఇంటి మీద మరి కొంత మంది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడులు చేశారు. అయితే దాడులు చేశాక అది చేయించింది ప్రభుత్వమేనని, డిజిపి దగ్గరుండి చేయించారు అన్నట్లుగా చంద్రబాబు సహా టిడిపి నేతలందరూ ఇప్పటికీ ఒకే మాటను వల్లె వేస్తున్నారు.

Also Read : Bail For Pattabhi - పట్టాభికి బెయిల్‌.. రెండు రోజుల్లోనే బయటకు..

అయితే లా అండ్ ఆర్డర్ అమలు చేయడానికి కట్టుబడి ఉన్న వైసీపీ ప్రభుత్వం మాత్రం దాడి చేసింది తమ పార్టీ వారేనని తెలిసినా చట్టప్రకారం వారు చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందేనని ముందుకు వెళుతుంది. అందులో భాగంగానే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 10 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దర్యాప్తులో భాగంగా 10 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ఈ రోజు ప్రకటించారు. పానుగంటి చైతన్య, పల్లపు మహేష్ బాబు, పేరూరి అజయ్, శేషగిరి పవన్‌కుమార్, అడపాల గణపతి, షేక్ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, జోగ రమణ, గోక దుర్గాప్రసాద్, లంక అభి నాయుడు అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి సీసీ ఫుటేజ్‌ కోసం టీడీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు.

ఇక టీడీపీ అధికార ప్రతినిధి, పట్టాభి ఇంటిపై దాడి కేసులో ఇప్పటివరకు 11 మంది అరెస్ట్ చేశామని విజయవాడ సీపీ వెల్లడించారు. పట్టాభి భార్య చందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి జరిగిన ప్రాంతంలోని ఆధారాలు, చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఆధారంగా 11 మంది అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పట్టాభి ఇంటిలోని సీసీ ఫుటేజీ డీవీఆర్ ఇవ్వమని కోరామని.. డీవీఆర్ అందిన తర్వాత విచారణ మరింత వేగవంతం చేస్తామని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

తప్పు చేసింది మన వాళ్ళు అయినా తప్పు తప్పే అన్న విధంగా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన కొన్ని సంఘటనలను చూస్తే ఎమ్మార్వో వనజాక్షి మీద చింతమనేని దాడి, ఆ తర్వాత విజయవాడలో వెలుగు చూసిన కాల్ మనీ కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమ పార్టీ నేతలను ఎక్కడా ఖండించిన దాఖలాలు లేవు. ఈ రెండు కేవలం ఉదాహరణలే కాగా అనేక సంఘటనలలో తమ పార్టీ నేతల ప్రమేయం ఉందని తెలిసినా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. అదే వైయస్ జగన్ ప్రభుత్వం మాత్రం తమ వాళ్ళు ఆవేశంతో దాడి చేసి ఉండవచ్చు కానీ దాడి చేయడం తప్పే అనే ఉద్దేశంతో చట్ట ప్రకారమే ముందుకు వెళుతుంది. నక్కకు నాగలోకానికి తేడా అంటారు చూశారూ, అది ఇలాంటి సమయాల్లోనే బయట పడుతూ ఉంటుంది.

Also Read : Chandrababu - పోలీసులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp