బలం లేకున్నాబరిలోకి టీడీపీ... భారీ సంఖ్యలో అభ్యర్థులు

By Voleti Divakar Nov. 20, 2020, 04:35 pm IST
బలం లేకున్నాబరిలోకి టీడీపీ... భారీ సంఖ్యలో అభ్యర్థులు

గ్రేటర్ ఎన్నికల సమరాంగణంలో అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితాల ప్రకటన చేస్తున్నాయి. తెలంగాణ లో పార్టీ ఊడ్చి పెట్టుకుపోయినా... టీడీపీ 90 మందిని బరిలోకి దింపింది. గత కొన్నిరోజులుగా టీడీపీ అధినాయకత్వం జీహెచ్ఎంసీ బరిలో దిగే అభ్యర్థులపై కసరత్తులు చేస్తోంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాకముందు జంటనగరాల్లో టీడీపీ బలంగా ఉనికిని చాటుకుంది. కాలక్రమంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం, టీఆర్ఎస్ ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు బీజేపీ కూడా దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం ఇచ్చిన ఉత్సాహంతో జీహెచ్ఎంసీ బరిలో దిగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అవకాశాలు ఎలా ఉంటాయన్నది కాలమే చెప్పాలి.

జిత్తుల్లో ఆరితేరిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఎన్నికల్లో లోపాయకారి పొత్తులు ఏవైనా పెట్టుకుంన్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా..గ్రేటర్ ఎన్నికల కోసం టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ ప్రచారానికి వస్తారని తెలుస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp