అశోక్ ను ఆవహించిన బాలయ్య !! మహిళా కార్యకర్తను కొట్టిన ఇజీనారం మారాజు..!

By Nehru.T Mar. 08, 2021, 05:09 pm IST
అశోక్ ను ఆవహించిన బాలయ్య !! మహిళా కార్యకర్తను కొట్టిన ఇజీనారం మారాజు..!

తెలుగుదేశం పార్టీలో ఒక ట్రెండ్, టెండెన్సీ నడుస్తోంది. నాయకులలో తన్నులు, దెబ్బలు కాయడం, ఆ తరువాత అయ్యో అదేం లేదు.. అభిమానంతో చేతిలో అలా మమ్మల్ని జరిపారు అంతే. ఇంకేం లేదు.. అని సమర్థించుకోవడం పరిపాటైంది. ఆ పార్టీలో ముఖ్యంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలు ఆమడదూరంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆయన చేతికిగానీ కాలికిగానీ అందుబాటులో ఉంటే తన్నులుగానీ, దెబ్బలు కానీ తప్పవు. గతంలో ఆయన ఎందరినో కొట్టి , నెట్టేశారు. తాజాగా హిందూపురంలో ఓ కార్యకర్తను కొట్టిపారేసిన సంఘటన గుర్తుంది కదా. ఆ ఘటన అయ్యాక మళ్లీ ఆ సదరు కార్యకర్త వచ్చి నన్ను బాలయ్య కొట్టలేదు. ఊరకనే ఆలా నెట్టారు అంతే అని ఏదేదో కవరింగు ఇచ్చాడు, అయినా సరే జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది. ఇప్పుడు తాజగా మరో అగ్రనేత ఇలాగే విచక్షణ కోల్పోయి మహిళా దినోత్సవం నాడు ఓ మహిళా కార్యకర్తలు మెడలు వంచి వీపు మీద కొట్టారు

అసలేం జరిగిందంటే

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అగ్రనేత, మాజీ కేంద్రమంత్రి, పాలిట్ బ్యూరో సభ్యుడు అయిన అశోక్ గజపతి రాజు పూల్ బాగ్ కాలనీ 14వ డివిజన్లో తమ అభ్యర్థి మద్దిల నాగ కుమారి తరఫున ప్రచారము చేస్తున్నారు. ఆయన, తన కుమార్తె అతిది గజపతిరాజుతో కలిసి వీధుల్లో ర్యాలీగా వెళుతూ ప్రజలను కలుస్తున్నారు. తమ అగ్రవేత వచ్చారన్న ఆత్యుత్సాహంతో కొందరు మహిళా కార్యకర్తలు వారిమీద పూలు జల్లుతున్నారు. అయితే ఎండవల్ల వచ్చిన చిరాకో, ఎంత చేసినా పార్టీ గెలవదన్న ఉక్రోషమో ఏమో గానీ ఆయన ఒక్క ఉదుటున ఆ మహిళా కార్యకర్తను పట్టుకుని మెడలు వంచి వీపుమీద ఫెడిల్మని ఒక్కటిచ్చారు. దీంతో మొత్తం ర్యాలీలో పాల్గొన్న వాళ్లంతా నిశ్చేష్టులయ్యారు. కాస్త బ్యాలెన్స్డా ఉండే అశోక్ గజపతి ఇలా చేశారేమిటని షాక్ అయ్యారు. ఆ మహిళా కార్యకర్త ఈ హఠాత్పరిణామంతో అవమానంగా ఫీలై పక్కకు వెళ్లిపోయారు. అశోక్ గజపతి ఉన్న ఫళంగా ఆలా ఎందుకు చేశారన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. అణచుకోలేని, కోపం, ఊక్రోషం అవమానం ఇవన్నీ కలగలిసి ఆయన్ను అలా నియంత్రణ కోల్పోయేలా చేశాయని ప్రజలు భావిస్తున్నారు

కార్యకర్తలేమంటున్నారంటే..!!

వాస్తవానికి ఆయన వారిస్తున్నా కొందరు మహిళా కార్యకర్తలు ఆయన వెంటపడి పూలుజల్లి, హారతులిచ్చి ఆయన్న ఇబ్బంది పెడుతున్నారు. ఆయన వద్దంటున్నా వారు విడవడం లేదు. ఈ దశలోనే ఆయన వెనక్కుతిరిగి ఓ మహిళా కార్యకర్త చేతిలోని హారతి పళ్లాన్ని నేలకేసి కొట్టారు తప్ప మహిళనేమి అనలేదని సర్దుబాటు మాటలు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా మహిళా దినోత్సవం నాడు ఓ మహిళా కార్యకర్త నుకొట్టడం అనేది ఎంతమాత్రం సహించలేనిదని మహిళలు అభిప్రాయపడుతున్నారు.

Read Also : అప్పుడు రెండు కళ్లు.. ఇప్పుడు మూడు నాల్కలు..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp