వ్య‌వ‌స్థ‌ను కాపాడే పోలీసు వ్య‌వ‌స్థ‌పై టీడీపీ దాడి

By Kalyan.S Sep. 16, 2021, 09:00 pm IST
వ్య‌వ‌స్థ‌ను కాపాడే పోలీసు వ్య‌వ‌స్థ‌పై టీడీపీ దాడి

"నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర పోలీసులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేయడం సమంజసం కాదు. గతంలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్ర పోలీసులు ప్రజలకు విశేష సేవలందిస్తూ.. అన్ని వర్గాలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తున్నారు. 2017లో 49.3 శాతం మందికి శిక్షలు పడగా, 2020లో 64 శాతం మందికి శిక్షలు పడేలా చేయడం ప్రభుత్వ, పోలీసుల చిత్తశుద్ధికి నిదర్శనం."

- టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడి ఆరోప‌ణ‌ల‌పై ఓ సంద‌ర్భంలో అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్.
"గౌరవనీయులైన ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు మీరు చేసిన పోస్ట్ సరైనది కాదు. మరోసారి మీరు చేసిన ఆరోపణలు తప్పుగా ఉన్నాయి. అక్కడ వైసీపీ కార్యకర్తలు గాయపడిన పోలీసుకు సాయం అందించారు. పడిపోయిన అతన్ని లేపి గాయాలను పరిశీలించారు. ఇటువంటి తప్పుడు ప్రచారానికి, తప్పుడు వార్తలకు దూరంగా ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఇటువంటి చర్యలు అనవసరంగా ప్రజలను తప్పుదారి పట్టిస్తాయి. పోలీసులను కూడా నిరుత్సహపరుస్తాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి మీరు దయచేసి పోలీసులకు సహకరించాలని అభ్యర్థిస్తున్నాం"

- ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కార్యాలయానికి కాపలాగా ఉన్న పోలీసుపై జరిగిన దాడిపై చంద్ర‌బాబు చేసిన ట్వీట్ పై ఫ్యాక్ట్ చెక్ హ్యాష్ ట్యాగ్ పేరుతో ఏపీ పోలీసు సంఘం ప్ర‌తినిధులు ఇచ్చిన రిప్ల‌య్‌..

‘‘పోలీసులపై నిరాధారమైన ఆరోపణలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రజా ప్రయోజనాల కోసం వాస్తవాలను వక్రీకరించకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేందుకు చంద్రబాబు కూడా సహరించాలని కోరుతున్నాం. మొగిలిచర్ల గ్రామంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘటనకు సంబంధించి పోలీసు శాఖపై కొన్ని ఆరోపణలు చేశారు. అధికార పార్టీ ఆదేశాల మేరకు పోలీసులు పని చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేయడం చాలా బాధాకరం. సరైన వాస్తవాలను తెలుసుకోకుండా పోలీస్ శాఖపై అలాంటి ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. ఇది గ్రామంలోని ఇరు రాజకీయ పార్టీలకు చెందిన వివాదం. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకూ కేసులు నమోదు చేశాం. కేసు విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారన్నది అవాస్తవం. ఇరువర్గాల కేసులపై లోతైన దర్యాప్తు చేపట్టాం. పోలీసుల బెదిరింపులకు ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారన్న ఘటనపై కూడా కేసు నమోదు చేసి నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నాం. ’’

- లింగసముద్రం మండలం మొగిలిచర్ల ఘటనపై ఏపీ డీజీపీకి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ స్పంద‌న ఇది.

ఇవ‌న్నీ ప‌రిశీలిస్తే.. వ్య‌వ‌స్థ‌ను కాపాడే పోలీసు వ్య‌వ‌స్థ‌పై టీడీపీ ఎందుకింత దాడి చేస్తోంది.. ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కోసం చంద్ర‌బాబు స‌హ‌క‌రించాల్సింది పోయి.. ఆత్మ‌స్థైర్యం దెబ్బ‌తీసేలా ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌ద‌ని పోలీసులు ఎందుకింత‌లా బాబు కోరుతున్నారు.. అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ప్ర‌తిప‌క్షంలో ఏ పార్టీ ఉన్నా.. పోలీసులు అధికార పార్టీకి ఒత్తాసు ప‌లుకుతున్నారంటూ ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌హ‌జ‌మే. అయితే.. ఈ రెండున్న‌రేళ్ల‌లో ఓ ప‌థ‌కం ప్ర‌కారం పోలీసుల‌పై టీడీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఎక్క‌డ ఏ సంఘ‌ట‌న జ‌రిగినా దాన్ని వెంట‌నే... పోలీసుల‌ను విమ‌ర్శిస్తూ లేఖ‌లు రాయ‌డం చంద్ర‌బాబుకు ప‌రిపాటిగా మారింది.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై ప్రతిపక్షాల దాడి రోజు రోజుకీ తీవ్రమవుతోందన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మాటలతో వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు టీడీపీ నేతలు. తమ అక్రమాలను, అవినీతిని బయటపెట్టనీయకుండా ముందుగానే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి దిగుతున్నారు. గ‌తంలో అచ్చెన్నాయుడు మరో అడుగు ముందుకేసి ఖాకీలకు తాట తీస్తామంటూ హెచ్చరించడం తీవ్ర సంచలనంగా మారింది.

ఇప్పటికే చంద్రబాబు, చినబాబు కూడా పోలీసులపై ఇలాగే నోరు పారేసుకున్నారు. దీన్ని ఇప్పుడు కింది స్థాయి నేతలు, కార్యకర్తలు కూడా కంటిన్యూ చేస్తున్నారు. తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారనేది టీడీపీ నేతల ఆరోపణ. అయితే అన్నీ త‌ప్పుడు కేసులేనా? అదే నిజ‌మైతే కోర్టులు శిక్ష‌లు ఎందుకు విధిస్తున్న‌ట్లు? ఆధారాలు లేకుండానే కేసులు న‌మోదు అవుతున్నాయా? అనేది టీడీపీ నేత‌ల‌కే తెలియాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp