టీడీపీ ఎమ్మెల్యేల డైరెక్షన్.. యువకుల యాక్షన్.. స్థానికులు బయటపెట్టిన నిరసన డ్రామా

By Ritwika Ram Jul. 25, 2021, 04:00 pm IST
టీడీపీ ఎమ్మెల్యేల డైరెక్షన్.. యువకుల యాక్షన్.. స్థానికులు బయటపెట్టిన నిరసన డ్రామా

నందమూరి తారక రామారావు.. ముఖ్యమంత్రి కాకముందు.. రాజకీయ నాయకుడు కాకముందు.. సినీ నటుడు. రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలను కొనసాగించినా.. రెండింటికీ మధ్య దూరం కొనసాగించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం కష్టపడ్డారు. ప్రజా సమస్యలపై సిన్సియర్ గా పని చేశారు. కానీ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ.. చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్లాక అందులో ‘రాజకీయ నటులు’ ఎక్కువయ్యారు. బాబు దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, కిందిస్థాయి కార్యకర్తల దాకా మహా నటులు చాలా మంది ఉన్నారు. సిన్సియర్ గా రాజకీయాలు చేసేటోళ్లు తక్కువయ్యారు. మీడియా ముందు యాక్టింగ్ చేసేటోళ్లు పెరిగిపోయారు. అందుకు తాజా ఘటనే నిదర్శనం.

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం గుమ్ములూరులో ఓ నిరసన కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టింది. ఎందుకయ్యా అంటే.. రోడ్లపై గుంతలు పడ్డా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంట. నిరసన కార్యక్రమం మొదలైంది. టీడీపీ ఎమ్మెల్యేలు మంతెన రామరాజు, నిమ్మల రామానాయుడు, పార్టీ నేతలు, కార్యకర్తలు వచ్చేశారు. వారితోపాటు ముగ్గురు యువకులు కూడా ఉన్నారు. తలకు, చేతులకు కట్లు కట్టుకున్నారు. చూసేటోళ్లకు వారిపై కొంచెం అనుమానంగానే ఉంది. అయినా సైలెంట్ గానే ఉన్నారు స్థానికులు. ఆ ముగ్గురు బైక్ పై వెళ్తుండగా, గుంతల్లో పడిపోయి గాయపడ్డారంట. వాళ్లను ఎమ్మెల్యేలు మీడియాకు చూపించారు. అక్కడితో ఆగలేదు. గుంతల్లో వరి నాట్లు వేశారు. చేప పిల్లల్ని వదిలారు.

Also Read : హుజురాబాద్‌లో నిజామాబాద్‌ సీన్‌ రిపీట్‌..! ఆర్ కృష్ణయ్య చెప్పినట్లు చేస్తారా..?

నిరసన పూర్తయ్యింది.. ఎవరిదారిన వాళ్లు వెళ్లారు. సీన్ కట్ చేస్తే.. గాయపడ్డారని ఎమ్మెల్యేలు చెప్పిన ముగ్గురు యువకులు పక్కకు వెళ్లి కట్లు ఊడదేశారు. మళ్లీ నిరసన చేసిన చోటుకే వచ్చారు. ఏ దెబ్బలు లేవు. అంతా యాక్టింగ్ అన్నమాట. వాళ్లను చూసి.. ఆశ్చర్యపోవడం స్థానికుల వంతు అయ్యింది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో మహా నటులే ఉన్నారంటూ ముక్కున వేలేసుకున్నారు. తమ ఫోన్లు చూసుకుంటూ నిలబడ్డ యువకుల ఫొటోలు తీసిన స్థానికులు.. వాటిని మీడియాకు పంపారు. దీంతో అసలు విషయం బయటపడింది. నిరసన పేరుతో టీడీపీ డ్రామాలు ఆడిందని తెలిసింది.

గతంలోనూ పెయిడ్ ఆర్టిస్ట్ తో ఇలానే యాక్టింగ్ చేయించింది టీడీపీ. 2019 ఆగస్టులో వానలకు తమ పంటలు మునిగిపోయాయని, వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ఆస్కార్ లెవెల్లో నటించేశాడు పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి. అంతటితో ఆగకుండా మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పైనా, యాదవ కులంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. నిజానికి ఏ రైతూ అలా మాట్లాడడు. ఎవరినీ అలా దూషించడు. దీంతో ఈ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు అందింది. విచారణ చేపట్టగా.. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటనల్లో కూడా నటించాడని, ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చేందుకే రైతు వేషం కట్టాడని వెల్లడైంది. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపారు.

Also Read : ఏలూరు కార్పొరేషన్ - వైసీపీ భారీ విజయం ,మూడు డివిజన్లకే పరిమితమైన టీడీపీ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp