BJP 1 Vote - ఇంట్లో 5 ఓట్లు.. అభ్యర్థికి దక్కింది ఒక్కటే!

By Ramana.Damara Singh Oct. 13, 2021, 07:30 pm IST
BJP 1 Vote - ఇంట్లో 5 ఓట్లు.. అభ్యర్థికి దక్కింది ఒక్కటే!

తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ అధికారులు పార్టీలవారీగా ఓట్లు లెక్కిస్తున్నారు. వీటిలో ఒక వార్డు అభ్యర్థికి ఒక్కటంటే ఒక్కటే ఓటు లభించింది. అది చూసి సదరు ఆభ్యర్థితో పాటు కౌంటింగ్ సిబ్బంది అవాక్కయ్యారు.

విశేషమేమిటంటే ఆ అభ్యర్థి కుటుంబంలో ఐదుగురు ఓటర్లు ఉన్నారు. వారందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ ఆ అభ్యర్థికి ఒకటే ఓటు లభించిందంటే.. సొంత కుటుంబ సభ్యులే ఆయనకు ఓటు వేయలేదని తేలిపోయింది. ఒక్క ఓటు సాధించిన ఆ అభ్యర్థి బీజేపీ తరఫున పోటీ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థితోపాటు పార్టీని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ఎక్కడ జరిగిందంటే..

తమిళనాడులో ఈ నెల 6, 9 తేదీల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యింది. అదే క్రమంలో కోయంబత్తూరులోని పెరియనైకేంపాలెం వార్డు లెక్కింపులో ఈ విడ్డూరం జరిగింది. ఈ వార్డు సభ్యుడిగా బీజేపీ నుంచి డి.కార్తీక్ పోటీ చేశారు. ఆయన ఇంట్లో కార్తీక్‌తోపాటు మరో నలుగురు సభ్యులు ఉన్నారు.వారందరూ ఓటింగ్‌లో పాల్గొన్నారు.కానీ కార్తీక్‌కు మొత్తం మీద ఒకే ఓటు లభించింది. అంటే వార్డులోని మిగతా ఓటర్లతోపాటు ఆయన కుటుంబంలోని వారు కూడా ఆయనకు ఓటు వేయలేదని స్పష్టం అయ్యింది. తనొక్కడి ఓటే అతనికి లభించింది.

Also Read : Kakinada Mayor - మేయర్‌ తొలగింపు ప్రక్రియ సమాప్తం.. ఉత్తర్వులు జారీ

క్షణాల్లో ఈ విషయం పాకిపోయింది. సోషల్ మీడియాలో అభ్యర్థి కార్తీక్ తోపాటు బీజేపీని నెటిజన్లు ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. కాంగ్రెస్ నేత అశోక్ కుమార్ స్పందిస్తూ ఇంట్లోవారి ఓట్లే దక్కకపోవడం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితికి నిదర్శనమని ఒక ట్వీట్ ద్వారా వ్యాఖ్యానించారు. కార్తీక్ తన ఎన్నికల పోస్టర్లో మోదీ, అమిత్ షా సహా ఏడుగురి ఫొటోలు పెట్టారని.. కానీ కనీసం ఏడు ఓట్లయినా రాలేదని ఎద్దేవా చేశారు. రచయిత కందస్వామి స్పందిస్తూ పోటీలో ఉన్న తమ కుటుంబ సభ్యుడి పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటు వేశారంటే ఆ ఇంట్లో ప్రజాస్వామ్యం ఉందని అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు.

విజయం దిశగా డీఎంకే

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఈనెల 6, 9 తేదీల్లో జిల్లా పంచాయతీ వార్డులు, జిల్లా పంచాయతీ యూనియన్ వార్డు పదవులకు ఎన్నికలు జరగా వాటికి ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం డీఎంకే సంపూర్ణ విజయం సాధిస్తోంది. మొత్తం 140 జిల్లా పంచాయతీ వార్డు పదవులకు ఎన్నికలు జరగ్గా వాటన్నింటిలోనూ డీఎంకే అభ్యర్థులు విజయం సాధించబోతున్నట్లు కౌంటింగ్ ట్రెండ్స్ సూచిస్తున్నాయి. అలాగే 1381 జిల్లా పంచాయతీ యూనియన్ వార్డు పదవులకుగానూ 1100 స్థానాల్లో డీఎంకే ఆధిక్యంలో దూసుకుపోతోంది.

Also Read : By Elections - నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది.. బరిలో భారీగా అభ్యర్థులు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp