నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే..

By Rishi K Jan. 12, 2021, 03:23 pm IST
నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నూతన సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న రైతులతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

చట్టాలను నిలిపివేసే అధికారం కూడా తమకు ఉందని అభిప్రాయపడిన ధర్మాసనం, ఇప్పుడు నూతన వ్యవసాయ చట్టాలపై స్టే విధించామే తప్ప చట్టాలను నిరవధికంగా నిలిపివేయబోవటం లేదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సమస్య పరిష్కారానికై నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని కూడా సుప్రీంకోర్టు నియమించింది. రైతుల ప్రతినిధులు, ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది.

సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో సభ్యులుగా హర్‌సిమ్రత్‌ మాన్, ప్రమోద్ జోషి, అశోక్ గులాటి, అనిల్ ధన్వంత్, భూపేంద్ర సింగ్ మాన్ ఉండనున్నారు. వీరిలో అశోక్‌ గులాటి వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌కు గతంలో ఛైర్మన్‌గా వ్యవహరించగా, ప్రమోద్‌ జోషి జాతీయ వ్యవసాయ అకాడమీ సంచాలకులుగా పనిచేశారు.కాగా నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడాన్ని రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp