హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీం స్టే

By Krishna Babu Nov. 25, 2020, 01:41 pm IST
హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీం స్టే

అమరావతి భూకుంభకోణం కేసులో ఏపీ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రధాన నిందితుడిగా నమోదైన ఎఫ్ఐఆర్ FIR No.08 / RCO-ACB-GNT/2020 కు సంబంధించి ఎలాక్ట్రానిక్, ప్రింట్ , సోషల్ మీడియాలో ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దు అంటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీం స్టే ఆర్డర్ విధించింది.

ఏపీ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రధాన నిందితుడిగా ఉన్న అమరావతి భూకుంభకోణం కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై దమ్మాలపాటి సెప్టెంబర్ 15న హౌస్ మోషన్ ఫిర్యాదు చేయడంతో హైకోర్ట్ నాటి సాయంత్రం 6.30 నిమిషాల ప్రాంతంలో విచారణ చేసి నాలుగు వారాల పాటు దర్యాప్తు నిలిపివేయాలని , ఎటువంటి విచారణ చేయవద్దని స్పష్టం చేసింది. అంతేగాకుండా తన ఎఫ్ ఐ ఆర్ వివరాలను మీడియాలో ప్రస్తావించకుండా ఆదేశాలు ఇవ్వాలన్న దమ్మాలపాటి పిటీషన్ పై కోర్ట్ సానుకూలంగా స్పందించింది.

అలాగే ఈ కేసుకి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో కూడా ప్రస్తావించకూడదని హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ పాస్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని కోర్ట్ ఆదేశించింది. ఆ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఏసీబీ డీజీ, సీఐడీ అదనపు డీజీ, ఇంటెలిజెన్స్‌ డీఐజీకు ఆదేశాలు జారీ అయ్యాయి.

నాడు హై కోర్టులో దమ్మాలపాటి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, శ్యాం దివాన్‌లు వాదనలు వినిపించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున ఏజీ శ్రీరామ్, ఏసీబీ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, సీఐడీ తరఫున మరో సీనియర్‌ న్యాయవాది ఎస్‌.సత్యనారాయణ ప్రసాద్‌లు వాదించారు.

ఇది ఇలా ఉంటే దమ్మలపాటి శ్రీనివాస్, జస్టిస్ రమణ కుమార్తెలు ఉన్న ఈ కేసు పై హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ ను సవాల్ చేస్తు జగన్ ప్రభుత్వం సెప్టెంబర్ 21న సుప్రీం తలుపు తట్టింది. హైకోర్టు ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులపై స్టే ఆర్డర్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్ పై జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం నేడు విచారించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కొన్ని కీలక వాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది . రాజధాని భూ కుంభకోణంకి సంబంధించి వివరాలు ఎందుకు వెల్లడి కావొద్దు? నేరం జరిగితే విచారణ జరపాల్సిన అవసరం లేదా? దమ్మాలపాటి పిటిషన్ వేస్తే 13 మందికి ఎలా వర్తింపజేస్తారు? అంటూ వాఖ్యనించి గ్యాగ్ ఆర్డర్ పై స్టే విదించింది. అయితే, అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై దర్యాప్తుపై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులపై మాత్రం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు. ఈ సమయంలో తమ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని పార్టీలను ఆదేశిస్తూ జనవరి 2021 కి విచారణ వాయిదా వేసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp