ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఏకంగా కొబ్బరి చెట్టెక్కిన మంత్రి..

By Kiran.G Sep. 19, 2020, 06:02 pm IST
ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఏకంగా కొబ్బరి చెట్టెక్కిన మంత్రి..

దేశంలో ఉన్న కొబ్బరి చెట్ల కొరత గురించి ప్రజలకు తెలియజేయడానికి ఓ మంత్రి చేసిన విన్నూత్న ప్రయత్నం శ్రీలంక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఆయన ఓ కొబ్బరి చెట్టు ఎక్కేసి తన గళాన్ని వినిపించారు.

వివరాల్లోకి వెళితే శ్రీలంక దేశానికి చెందిన మంత్రి అరుందికా ఫెర్నాండో దేశంలో ఉన్న కొబ్బరి చెట్ల కొరత గురించి ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ప్రజల డిమాండ్‌ను ప్రజలకు విన్నూత్న రీతిలో వినిపించాలని కొబ్బరి చెట్టు ఎక్కి దేశంలో ఉన్న కొబ్బరి చెట్ల కొరత గురించి మాట్లాడారు. శ్రీలంకలో ప్రజలు ఎక్కువగా కొబ్బరి చెట్లపై ఆధారపడతారు. అంతేకాకుండా దేశంలో పారిశ్రామిక అవసరాల భారీగా కొబ్బరిని వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని మాములుగా చెబితే ఎవరూ వినరని అనుకున్నారేమో కానీ చెట్టెక్కి మరీ ప్రభుత్వానికి మరియు ప్రజలకు సూచనలు సలహాలు ఇచ్చారు.

కొబ్బరికాయల సాగు కోసం శ్రీలంకలో అందుబాటులో ఉన్న ప్రతి భూమిని కొబ్బరి సాగు కోసం వినియోగించుకొని, పరిశ్రమకు ఊతం ఇవ్వాలని ఆశిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రస్తుత ధరల సమస్యకు పరిష్కారంగా, కొబ్బరి కాయల కొరత ఉన్నప్పటికీ ధరలను తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది అని అరుందికా ఫెర్నాండో పేర్కొన్నారు. కొబ్బరివల్ల విదేశీ మారకద్రవ్యం పెరుగుతుందని కాబట్టి కొబ్బరి ఉత్పత్తులను వృద్ధి చేయడానికి కొబ్బరి చెట్ల పెంపకాన్ని పెంచేలా చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. మంత్రి అరుందికా ఫెర్నాండో చేసిన తాజా చర్య ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన చర్యను పలువురు ప్రశంసిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp