స్పీకర్ కి గాల్లో ముద్దులు

By Kiran.G 20-11-2019 02:13 PM
స్పీకర్ కి గాల్లో ముద్దులు

ఒడిశా అసెంబ్లీ లో కాంగ్రెస్ ఎంఎల్ఏ తారాప్రసాద్ బహినిపతి తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడుతూ ఉండగా అసెంబ్లీ స్పీకర్ ఎస్ఎన్ పాత్రో అభినందించారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ ఎంఎల్ఏ తారప్రసాద్ బహినిపతి, స్పీకర్ కి గాల్లో ముద్దులు ఇచ్చారు. ఈ సంఘటన చూసి అక్కడున్న కొందరు అసెంబ్లీ సభ్యులు నవ్వుకున్నారు. మరికొందరు మాత్రం తారప్రసాద్ చేసిన పనికి అభ్యంతరం వ్యక్తం చేసారు. కాగా ఈ సంఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివరణ ఇస్తూ స్పీకర్ ని కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని, తన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు విని స్పీకర్ సానుకూలంగా స్పందించినందుకే అలా చేసానని తెలిపారు. సభలో 147 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే, మొదట్లోనే తను మాట్లాడటానికి సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా, గాల్లో ముద్దులు విసిరానని, స్పీకర్ పాత్రోకి అభినందనలు ఆ విధంగా తెలిపానని తారప్రసాద్ బహినిపతి వివరణ ఇచ్చారు.

కాగా గతంలో ఒడిస్సా విద్యాశాఖ, మహాత్మ గాంధీ ప్రమాదంలో చనిపోయాడని ముద్రించిన కరపత్రాలు పాఠశాలల్లో పంపిణి చేసి, వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిస్తామని ఒడిస్సా విద్యాశాఖ మంత్రి వివరణ ఇచ్చిన విషయం విదితమే .

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News