అధికారిని చెప్పుతో కొట్టిన బిజెపి నాయకురాలు ఫొగట్

By Jagadish J Rao Jun. 05, 2020, 10:08 pm IST
అధికారిని చెప్పుతో కొట్టిన బిజెపి నాయకురాలు ఫొగట్

సోనాలి ఫొగట్ హర్యానాలో అందరికి సుపరిచితమైన టిక్‌టాక్ స్టార్.ఆమె వివాదస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తాల్లో చర్చనీయాంశంగా ఉంటారు.తాజాగా ఆమె ఒక అధికారిని చెప్పుతో కొట్టి మరోసారి వార్తాల్లోకి ఎక్కింది. సోనాలి ఫొగాట్ హర్యానాలోని ఒక అధికారిని చెంపదెబ్బ కొట్టి, చెప్పుతో పదేపదే కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

గ‌త హ‌ర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఆదంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన సోనాలి ఫొగాట్.. "భార‌త్ మాతాకీ జై" అని నిన‌దించని వారిని పాకిస్తానీయులుగా వ‌ర్ణిస్తూ వార్త‌ల్లోకెక్కిన విష‌యం తెలిసిందే.తాజాగా ఆమె ధాన్యం మార్కెట్‌లో అధికారిని చెప్పు తీసుకుని కొట్టారు.

శుక్రవారం రైతులిచ్చిన డిమాండ్ లిస్ట్‌తో బాలాస్మంద్‌లోని ధాన్యం మార్కెట్‌కి ఫొగాట్ వెళ్లింది.ఈ క్ర‌మంలో అక్క‌డున్న మార్కెట్ సెక్ర‌ట‌రీతో ఆమెకు వాదులాట జ‌రిగింది. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన సోనాలి అత‌నికి చెంప‌దెబ్బ రుచి చూపించింది. అంత‌టితో ఆగ‌కుండా చెప్పు తీసుకుని ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా కొట్టింది.దీనికి సంబంధించిన‌ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.ఈ సంఘటన గురించి సొనాలి మాట్లాడుతూ అత‌ను దుర్భాష‌లాడుతూ,త‌న‌ను అవ‌మానించ‌డం వ‌ల్లే కొట్టాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది.అయితే మార్కెట్ సెక్ర‌ట‌రీ మాత్రం తానేమీ అన‌క‌ముందే సోనాలి త‌న‌పై దాడి చేసింద‌ని చెప్పుకొచ్చాడు.

"నావైపు చూసి మాట్లాడండి.మీకు నేను తెలుసా అని ఆమె అడిగింది.మీరు అధంపూర్ నుండి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు నాకు తెలుసు అన్నాను.మీ ఫిర్యాదులను నోట్ చేసుకున్నానని, వాటిని పరిష్కరిస్తామని నేను ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె ఎందుకు మీరు ఎన్నికలలో నన్ను వ్యతిరేకించారు? అని అడిగారు.అధంపూర్‌లో నా కుటుంబం లేదని నేను ఆమెతో చెప్పాను. మీ నియోజకవర్గంలో లేని నేను ఎలా ఓటు వేస్తాను? ఎన్నికలు జరిగిన చాలా కాలం తర్వాత మీరు నన్ను ఎందుకు నిందిస్తున్నారు? అని అడిగాను. అప్పుడు ఆమె మీరు నన్ను దుర్భాషలాడున్నారని అనడం ప్రారంభించారు. నేను దుర్భాషలాడ లేదని చెప్తూనే ఉన్నాను. ఇంతలోనే అకస్మాత్తుగా ఆమె నాపై దాడి చేసి చెంపదెబ్బ కొట్టారు"అని అధికారి విలేకరులతో అన్నారు.

ఇదిలా ఉంటే అధికారిని చెప్పుతో కొట్టిన ఫొగట్ పై చర్యలు తీసుకోవాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. "ఖట్టర్ ప్రభుత్వం వికారమైన పనులు చేస్తోందని, అధంపూర్ బిజెపి నేత మార్కెట్ కమిటీ కార్యదర్శిని జంతువులా కొట్టారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండటం నేరమా?ఖట్టర్ సాహబ్ చర్యలు తీసుకుంటారా? మీడియా మౌనంగా ఉంటుందా?" అని ఆయన ప్రశ్నించాడు.

టిక్‌టాక్‌తో గుర్తింపు సంపాదించుకున్న సోనాలి ఫొగ‌ట్‌కు బిజెపి గ‌తేడాది జరిగిన ఎన్నికలలో హ‌ర్యానాలోని ఆదంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ ఇచ్చింది. ఆమె గెలుపు త‌థ్య‌మ‌నుకున్న‌ప్ప‌టికీ అందరి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ కాంగ్రెస్ నేత కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఓడిపోయారు.

గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీలో సోనాలి ఫొగ‌ట్‌ "భారత్ మాతా కీ జై" అని అనలేని వారికి "విలువలు లేవు" అనే అని వ్యాఖ్యానించడం అప్పట్లో వివాదాస్పదమైంది. "మీరంతా పాకిస్తాన్ నుండి వచ్చారా? మీరు భారతీయులైతే భారత్ మాతా కీ జై అని చెప్పండి" అని ఆమె పేర్కొంది. కానీ ఆమె పిలుపుకు ఉత్సాహభరితమైన ప్రతిస్పందన రాలేదు. అప్పుడు ఆమె "మీ అందరినీ చూసి నేను సిగ్గుపడుతున్నాను. మీలాంటి భారతీయులు ఉన్నారని...తమ దేశం కోసం, రాజకీయాల కోసం జై చెప్పలేని వారిని చూసి...''భారత్ మాతా కీ జై'' అని చెప్పలేని వారి ఓట్లకు విలువ లేదు" అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తనపై దాడి చేసి బెదిరించాడని ఆరోపిస్తూ గత ఏడాది తన సోదరి, బావ మరిదిపై పోలీసు ఫిర్యాదు చేసిన సందర్భంలోను ఫొగట్ వార్తాల్లో నిలిచారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp