విశాఖ భూ దందాపై సిట్‌ విచారణ సాఫీగా సాగుతుందా..?

By Kotireddy Palukuri Oct. 18, 2020, 04:05 pm IST
విశాఖ భూ దందాపై సిట్‌ విచారణ సాఫీగా సాగుతుందా..?

తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న అతిపెద్ద భూ కుంభకోణాల్లో మొదటి స్థానంలో అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాగా. రెండో అతిపెద్ద స్కాం విశాఖలో జరిగిన భూ అక్రమాలు. ఈ రెండు కుంభకోణాలపై వైసీపీ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. అమరావతి భూ కుంభకోణంపై జరుగుతున్న విచారణపై హైకోర్టు స్టే ఇవ్వగా.. కోవిడ్‌ కారణంగా విశాఖ భూ కుంభకోణంపై ఆగిపోయిన సిట్‌ విచారణ తిరిగి ప్రారంభమైంది. ఈ రోజు ఆదివారం సిట్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్, సభ్యులు అనూరాధ, భాస్కరరావులతో విశాఖలో సమావేశమౖయె విచారణ పై చర్చించారు.

గత ఏడాది అక్టోబర్‌లో సిట్‌ను జగన్ సర్కార్ నియమించింది. అనంతరం నవంబర్‌ ఒకటి నుంచి 7వ తేదీ వరకు సిట్ సభ్యులు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 1400ల దరఖాస్తులురాగా ఇప్పటి వరకు 400లు ఫిర్యాదులకు సంబంధించి విచారణ పూర్తి చేశారు. ఇంకా 1000 దరఖాస్తులపై దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. రెండు, మూడు నెలల్లో వీటి విచారణ పూర్తి చేయాలన్న లక్ష్యంతో సిట్‌ బృందం పనిచేస్తోంది. ఎన్‌వోసీలు, భూ స్థితి మార్పు, రికార్డుల ట్యాంపరింగ్, ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కట్టబెట్టడం... తదితర అక్రమ వ్యవహారాలపై విచారిస్తున్నారు.

విశాఖ చుట్టుపక్కల 13 మండలాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూ కుంభకోణాలు జరిగినట్టుగా సిట్‌ బృందం గుర్తించింది. విశాఖ రూరల్, ఆనందపురం, పద్మనాభం, భీమిలి, నగర పరిధిలోని మహారాణిపేట, ములగాడ, గోపాలపట్నం, సీతమ్మధార, గాజువాక, పెదగంట్యాడ, సబ్బవరం, పరవాడ, పెందుర్తి మండలాల్లో భూ కుంభకోణాలు జరిగాయని గతంలో ఆరోపణలు వచ్చాయి.

రెండు మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలనే లక్ష్యంతో సిట్‌ ఉండగా.. ఆ లోపు ఏం జరగబోతోందన్న చర్చ రాష్ట్రంలో నడుస్తోంది. అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై జరుగుతున్న అన్ని సంస్థల విచారణలను ఏపీ హైకోర్టు నిలిపివేసిన నేపథ్యంలో విశాఖ భూ దందాపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఆసక్తి నెలకొంది. తమపై కక్ష సాధించేందుకే వైసిపి ప్రభుత్వం సిట్‌ విచారణ చేయిస్తోందంటూ, విచారణ ఆపేలా ఆదేశాలు ఇవ్వాలనేలా ఏపీ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు అవుతాయనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే సిట్‌ ప్రాథమిక విచారణను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ప్రస్తుతం తుది విచారణ ప్రారంభమైంది.

విశాఖలో దాదాపు లక్ష ఎకరాల మేర భూ అక్రమాలు జరిగాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పటి మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత అయ్యన్న పాత్రుడే విశాఖ భూ దందాపై ప్రత్యక్షంగా విమర్శలు చేశారు. ఎక్కడ నుంచో వచ్చిన వారు ఇక్కడ భూములు ఆక్రమిస్తున్నారంటూ పరోక్షంగా అప్పటి తన సహచర మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పెద్దలు రంగంలోకి దిగి ఇరువురి మధ్య సయోధ్య కుదిరించారు. ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో చంద్రబాబు ప్రభుత్వం విచారణకు సిట్‌ను నియమించి చేతులు దులుపుకుంది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం నియమించిన సిట్‌ విచారణకు న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు లేకపోతే కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన భూ దందాలో ఎవరు సూత్రదారులు, ఎవరెవరు పాత్రదారులనే విషయాలు వెలుగులోకి వస్తాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp