చిరంజీవి మృతి చెందారంటూ ట్వీట్- ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు

By Rishi K Jun. 08, 2020, 09:18 am IST
చిరంజీవి మృతి చెందారంటూ ట్వీట్- ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు

సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో బ్రహ్మానందం పాత్రకి ఎవరైనా ఏదైనా చెప్తే పూర్తిగా వినే ఓపిక ఉండదు. ఒకవేళ విన్నా వేరేగా అర్థం అవుతుంది. అందుకే ఆ మూవిలో తొందరపాటులో ఒక విషయాన్ని కాస్త వేరేగా అర్థం చేరుకునే వారి గురించి ఉంటుంది..అందుకే "అదేంటీ సార్ శంకరాభరణం కథ చెబితే అడవి రాముడు అర్థం చేసుకున్నారు" అని బ్రహ్మానందాన్ని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. తాజాగా ప్రముఖ కాలమిస్ట్ శోభా డే వ్యవహిరించిన తీరు అలాగే ఉంది..

ఒక్కోసారి తొందరపాటులో చేసే పొరపాటుకి తీవ్ర మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ప్రముఖ కాలమిస్ట్ శోభా డే కి ఎదురయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంతో పాటుగా సామాజిక అంశాలపై స్పందించే వారిలో శోభా డే ముందువరుసలో ఉంటారు. కానీ ఆవిడ తొందరపాటులో చేసిన ఒక ట్వీట్ కారణంగా చిరంజీవి అభిమానుల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి మృతి చెందారంటూ ఒక ఫోటో పెట్టి సినీ పరిశ్రమ మరో స్టార్ ని కోల్పోయింది అంటూ ట్వీట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రతికి ఉన్న వ్యక్తిని చనిపోయారంటూ తప్పుగా ట్వీట్ చేసిన శోభా డే పై విరుచుకుపడ్డారు. దీంతో తప్పు తెలుసుకున్న శోభా డే సదరు ట్వీట్ ను తొలగించింది.

నిజానికి చిరంజీవి స‌ర్జా అనే కన్నడ నటుడు గుండెపోటుతో మరణించారు.శనివారం భోజనం చేసిన తరవాత చిరంజీవి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆయన్ని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం చిరంజీవి తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారని సమీప బంధువు తెలియజేశారు. చిరంజీవి సర్జ ప్రముఖ నటుడు అర్జున్ కి మేనల్లుడు.. కానీ ఆ వార్తను పూర్తిగా గమనించకుండానే మెగాస్టార్ చిరంజీవి చనిపోయారని ట్వీట్ చేసి మెగాభిమానుల ఆగ్రహానికి గురయింది శోభా డే.. అందుకే సెన్సేటివ్ విషయాల్లో తొందరపాటుగా ఉండకూడదని శోభా డే కి పలువురు హితబోధ చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp