ఏఐసీసీలో సీనియ‌ర్లు వ‌ర్సెస్ జూనియ‌ర్లు..?

By Kalyan.S Aug. 07, 2020, 01:18 pm IST
ఏఐసీసీలో సీనియ‌ర్లు వ‌ర్సెస్ జూనియ‌ర్లు..?

కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త వివాదాలు ఆది నుంచీ తెలిసిందే. సాధార‌ణంగా ఎన్నిక‌ల వేళ సీట్ల పంచాయ‌తీ సంద‌ర్భంగా ఇవి బ‌హిర్గ‌తం అవుతాయి. లేదా జిల్లా, రాష్ట్ర క‌మిటీల ఎంపిక‌లో లొల్లి జ‌రుగుతూ ఉంటుంది. ఒక్కోసారి నిర‌స‌న కార్య‌క్ర‌మాల సంద‌ర్భంగా కూడా ఒకే పార్టీలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య వివాదాలు చోటుచేసుకున్న సంద‌ర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఆలిండియా కాంగ్రెస్ క‌మిటీలోనే లుక‌లుక‌లు మొద‌లైన‌ట్లు క‌నిపిస్తోంది. దేశంలో కాంగ్రెస్ ప‌రిస్థితి అంత‌కంత‌కూ దిగ‌జారిపోతుండ‌డ‌మే ఇందుకు కార‌ణంగా తెలుస్తోంది. దీనికి కార‌కులు మీరంటే.. మీరు అంటూ ఆ పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కులు, జూనియ‌ర్ నాయ‌కుల మ‌ధ్య వాదోప‌వాదాలు జ‌రుగుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

సోనియా ముందే...

ఎన్నిక‌ల‌కు ముందు, త‌ర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి, ప్ర‌స్తుత రాజ‌కీయాల‌పై కొద్ది రోజుల క్రితం సోనియాగాంధీ అధ్య‌క్ష‌త‌న వెబినార్ ద్వారా స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో సీనియ‌ర్ల‌కు, జూనియ‌ర్ల‌కు మ‌ధ్య తీవ్ర వాదోప‌వాదాలు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. సాక్షాత్తూ సోనియా గాంధీ స‌మ‌క్షంలోనే.. రాహుల్ టీం స‌భ్యులు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు చేశారు. సీనియ‌ర్ల తీరుతోనే పార్టీ ఘోర ప‌రాభ‌వం పొందుతోంద‌ని ప‌రోక్షంగా మ‌న్మోహ‌న్ సింగ్ ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు. ఆ స‌మావేశంలో ఆయ‌న ఉన్నా మౌనంగానే ఉన్నారు. మ‌న్మోహ‌న్ కేబినెట్ లో మంత్రులుగా ప‌ని చేసిన సీనియ‌ర్ నాయ‌కులు శ‌శిథ‌రూర్, ఆనంద్ శ‌ర్మ‌, మ‌నీశ్ తివారీ, మిలింద్ దేవ‌రా... మ‌న్మోహ‌న్ కు బాస‌ట‌గా నిలిచారు. దేశంలోని ప‌రిస్థితుల‌పై పూర్తి అవ‌గాహ‌న లేకుండా సీనియ‌ర్ల‌పై ఇటువంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌ద‌ని వారికి సూచించిన‌ట్లు తెలిసింది.

ట్విట్ట‌ర్ వేదికగా బ‌హిర్గ‌తం

వెబినార్ స‌మావేశం అనంత‌రం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఏఐసీసీలోని విబేధాలు బహిర్గ‌తం అయ్యాయి. ఆ స‌మావేశం అనంత‌రం కేంద్ర మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత మ‌నీశ్ తివారీ కాంగ్రెస్ లోని జూనియ‌ర్, ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా ధ్వ‌జ‌మెత్తారు. ఆరోప‌ణ‌లు చేసే ముందు ఆలోచించాల‌ని సూచించారు. ఆయ‌న‌కు పూర్తి మ‌ద్ద‌తు ఇస్తూ మ‌రో్ సీనియ‌ర్ నేత శ‌శిథ‌రూర్ మరో ట్వీట్ చేశారు. రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆనంద్ శ‌ర్మ కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌న్మోహ‌న్ కు మ‌ద్ద‌తు ప‌లుకుతూ జూనియ‌ర్ల‌పై ఆరో్ప‌ణ‌లు చేశారు. ఈ వివాదాలు ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉండ‌డంతో సోనియాగాంధీ వాటికి ఫుల్ స్టాప్ పెట్టేలా ప్ర‌య‌త్నాలు చేయాల‌ని రాహుల్ గాంధీకి సూచించిన‌ట్లు తెలిసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp