కస్టడీ డెత్‌ కేసులో అరెస్టైన సీఐ కరోనాతో మృతి

By Kiran.G Aug. 10, 2020, 04:40 pm IST
కస్టడీ డెత్‌ కేసులో అరెస్టైన సీఐ కరోనాతో మృతి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల(జయరాజ్‌, బెనిక్స్‌) కస్టడీ డెత్‌‌ కేసులో సీబీఐ అరెస్టు చేసిన పోలీసుల్లో ఒకరైన సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ పాల్‌దురై కరోనాతో కన్నుమూశారు.

వివరాల్లోకి వెళితే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న నెపంతో తండ్రీ కొడుకులైన జయరాజ్ మరియు బెన్సిక్‌లను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలంచి వారిని చిత్రవధకు గురిచేశారు. దీంతో వారికి తీవ్ర గాయాలవడంతో వారిద్దరూ పోలీస్ కస్టడీలో ఉండగానే మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. పోలీసుల తీరును దుయ్యబడుతూ పలువురు ఆందోళన చేపట్టడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీంతో కేంద్రప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.

రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు ఈ కేసుపై విచారణ జరిపి తండ్రీ కొడుకులు మరణానికి కారణం అయిన 10 మంది పోలీసులను అరెస్ట్ చేసింది. వారిలో సబ్ ఇన్స్‌పెక్టర్‌ పాల్‌దురై కూడా ఒకరు. కాగా పాల్‌దురైకి కొన్ని రోజుల క్రితం కరోనా సోకడంతో ఆయనను హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా వల్ల ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఈరోజు ఉదయం పాల్‌దురై మృతి చెందారు. సరైన వైద్యం అందించని కారణంగా పాల్‌దురై చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp