అజిత్ సింగ్ - (భగత్ సింగ్ చిన్నాన్న) - దేశం విస్మరించిన విప్లవకారుడు.

By Krishna Babu Aug. 15, 2020, 03:00 pm IST
అజిత్ సింగ్ - (భగత్ సింగ్ చిన్నాన్న) - దేశం విస్మరించిన విప్లవకారుడు.

ఆగస్టు 15 1947 - ఏళ్ల తరబడి సాగించిన పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. ప్రతి ఏటా స్వతంత్ర పర్వదినాన్ని ఆనందంగా జరుపుకుంటాము కాని అదే సమయంలో తన కుటుంబాన్ని విడిచి జీవితాన్ని స్వతంత్ర పోరాటానికి అంకితం చేసిన వ్యక్తి అజిత్ సింగ్ చనిపోయిన రోజు అని స్మరించుకోకపోవడం బాధాకరం. 1947 ఆగస్టు 15 న హిమాచల్ ప్రదేశ్ లోని దల్ హౌసీలో రేడియోలో నెహ్రు గారి స్వతంత్ర సందేశం వింటూ తన ఆఖరి శ్వాస విడిచారు అజిత్ సింగ్ . ఆయన చివరి మాటలు " దేవుడా నీకు దన్యవాదాలు నా ఆశయం నేరవేరింది " అంటూ తన చివరి శ్వాస విడిచారు. భగత్ సింగ్ బ్రిటీష్ నిరంకుశ చట్టాలని వ్యతిరేకిస్తు ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు వేసినప్పుడు కూడా ఆనాటి వార్తా పత్రికలు ప్రముఖ విప్లవకారుడు అజిత్ సింగ్ గారి అన్న కొడుకు భగత్ సింగ్ అని ప్రపంచానికి భగత్ సింగ్ ని పరిచయం చేశాయి, అప్పటివరకు కూడా విప్లవ తేజం భగత్ సింగ్ దేశంలో కొంతమందికే తెలుసు.

Also Read: జైళ్లలో జన్మించిన గ్రంధాలు

అజిత్ సింగ్ 23 జనవరి 1881 పంజాబు లోని కత్కర్ కలన్ అనే గ్రామంలో జన్మించారు. బాంగ అనే గ్రామంలో ప్రాధమిక విద్యని పూర్తి చేసి ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీలో లా చదవటానికి వెళ్ళి అక్కడ ఆరోగ్యం సహకరించక లాహోర్ తిరిగి వచ్చి డి.ఏ.వి కాలేజిలో 1894లో డిగ్రీ పట్టా పొందారు. వీరి తండ్రి అయిన అర్జున్ సింగ్ (భగత్ సింగ్ తాత గారు) కూడా సమాజ సేవకుడు ఆర్య సమాజ్ తరుపున పని చేస్తు అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వ్యక్తి . తండ్రి అడుగు జాడలలో నడుస్తు లాలా లజపతి రాయితో కలిసి ఎన్నో పోరాటలలో పాల్గొని పలుమార్లు జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి అజిత్ సింగ్.

Also Read: నిప్పుకణిక సర్దార్ భగత్ సింగ్

బ్రిటిషు వారి విధానాల వలన కరువు ప్రాంతం గా మారిన దేశం ని చూసి చలించిపోయి ప్రజల కష్టాలు తెలుసుకొవటానికి ఉత్తర భారత దేశం మొత్తం అన్న కిషన్ సింగ్ తో కలిసి పర్యటించారు. తన పర్యటనలో కరువు కోరలకి ఆనవాలుగా మిగిలిన హర్నాం కౌర్ ని పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చారు. 1903లో వైస్రాయి లార్డ్ కుర్జొన్ కి వ్యతిరేకంగా అజిత్ సింగ్ రాజులందరినీ కలిసి బ్రిటిషు పాలనకి వ్యతిరేకంగా 1857 మాదిరి ఉద్యమం చేద్దాం ప్రతిపాదన తీసుకుని వచ్చారు, చివరికి రాజుల సహకారం లేక విరమించుకొన్నారు.

ఆ ఘటన తరువాత భారత్ మాతా సొసైటి అని ఒక సంస్థని ప్రారంబించారు దానిలో రకరకాల విప్లవ కారులైన సుఫి అంబా , మహసేయ రాం లాంటి వారిని కలుపుకుని 1907 లో 1857 సిపాయి తిరుగు బాటుకి 50 సంవత్సరాలు సందర్బంగా మరో తిరుగుబాటుకి ప్రయత్నించారు, ఎన్నో ఉపన్యాసాలు ఇస్తు ప్రజల మద్దతు కూడగట్టారు వేదికల పై " పగడి సంబాల్ జట్టా పగడి సంబాలు ఒయే" అనే పాట పాడుతు ప్రజలలో ఉన్నఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టారు . తరవాత ఇది పగడి సంబాలు జట్టా అనే పేరుతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది . బ్రిటీషు ప్రభుత్వం మరో 1857 నాటి ఉద్యమం జరగబోతుంది అని భయపడి లాలాలజపతి రాయి , అజిత్ సింగ్ , కిషన్ సింగ్ మిగిలిన నాయకులందరిని జైలులో పెట్టింది. అజిత్ సింగ్ పట్టుదల చూసి బాలగంగాదర్ తిలక్ ఒక మీటింగ్ లో స్వతంత్ర భారతావనికి ప్రసిడెంటు అయ్యే అర్హత ఒక్క అజిత్ సింగ్ కే ఉంది అని చెప్పి అజిత్ సింగ్ నిబద్దతను చాటిచెప్పారు.

Also Read: వీర కిశోరం చంద్ర శేఖర్ ఆజాద్

జైలు నుండి విడుదల అయిన తరువాత బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత మాత సోసైటీ నుండి ఎన్నో రచనలు చేశారు. ఈసారి బ్రిటిషు వారు అజత్ సింగ్ ని పట్టుకుని మరణ శిక్ష వేయటానికి రంగం సిద్దం చేస్తున్న సమయంలో ఈ విషయం తెలుసుకున్న అజిత్ సింగ్ మిత్రుడి సుఫి అంబాతో కలిసి 1908 చివరిలో దేశం నుండి కరాచి ద్వారా ఇరాన్ చేరుకున్నారు అప్పుడు భగత్ సింగ్ వయసు 2 సంవత్సరాలు. అక్కడనుండి విప్లవ కారుల చేత రచనలు పంపుతూ గడిపి బ్రిటీషు వారికి దొరకకుండా రష్యా ,అమెరికా, టర్కీ, స్విట్జర్లాండ్ , లండన్, ఐర్లాండ్ , పొలాండ్, ఫిన్లాండ్ దేశాలు తిరుగుతూ విప్లవకారులని పోగు చేస్తూ భారతదేశానికి పంపుతూ గద్దార్ పార్టీ లాంటి వాటిని తయారు చేయటంలో కీలకంగా వ్యవహరించారు.

Also Read: సమర నినాదం ఉధం సింగ్

దేశం విడిచి వెళ్ళి 38 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపిన అజిత్ సింగ్ నెహ్రు ఆదేశాల మేరకు 1947 ఏప్రిల్ 9 న ఇండియాకి వచారు. అజిత్ సింగ్ సుద్దీర్గ అజ్ఞాత జీవితం అనంతరం భారత్ లోకి అడుగుపెట్టగానే ఇక్కడ మత ఘర్షణలు చూసి చలించిపోయారు. బాధతో దేశ యువతకి తన రచన ద్వారా ఒక లేఖని పంపి అందులో దేశానికి ఇప్పుడు సోషల్ అండ్ పొలిటికల్ రిజల్యుషన్ అత్యవసరం, భగత్ సింగ్ ఆశయాల కోసం యువత పనిచెయాలి అని చెప్పారు. వచ్చిన మూడు నెలలకే ఆయన స్వతంత్రం ప్రకటించిన రోజే ఆనారొగ్యంతో కన్నుమూసారు. 38 సంవత్సరాల తరవాత వచ్చిన ఆయనని లాహోరులో భారీ జనాల మద్య ఊరేగింపు తో ఇంటికి తీసుకుని వెళ్ళారు . భగత్ సింగ్ ని ఆయన 2 ఏళ్ళ వయస్సులో చూడటం తప్ప ఎప్పుడు కలుసుకోలేదు, కాకపోతే వీరిమద్య భారత దేశ పరిస్థితుల గురించి చాలా ఉత్తరాలు నడిచాయి.

Also Read: కకొరి రైలు దోపిడి -- 1925 ఆగస్టు 9

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp