ఇసుక విధానంలో మరింత పారదర్శకత

By Surya.K.R 18-11-2019 03:48 PM
ఇసుక విధానంలో మరింత పారదర్శకత

ప్రభుత్వాలు ఎన్ని మారినా, విధానాలు ఎన్ని మార్చినా ఇసుక మాఫియాని అడ్డుకొవటంలొ విఫలం అవుతూనే వచ్చారు. ధనార్జనే ధ్యేయంగా ఇసుక మాఫియా రెచ్చిపొయింది, రాజకీయ నాయకుల అండతొ సహజ వనరులు కొల్లకొట్టింది, అడ్డువచ్చిన అధికారులపై, సామాన్య ప్రజలపై దాడులు చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ జరిపిన జాతీయ హరిత ట్రిబ్యునల్ గత ప్రభుత్వానికి 100 కోట్ల జరిమాన విధించింది అంటే రాష్ట్రంలొ ఇసుకాసురుల రాజ్యం ఎంత స్వేచ్చగా సాగిందొ అర్ధం చేసుకొవచ్చు.

ప్రజా సంకల్ప యాత్ర సంధర్భంగా జగన్ తాను అధికారంలొకి రాగానే ఇసుక మాఫియాను అరికడతాను, ఇప్పుడు ఉన్న ఇసుక విధానాన్ని మార్చి పూర్తి పారదర్శకత తొ అమలయ్యే విధానాన్ని తీసుకువస్తాను అని వాగ్ధానం చేశారు, అధికారంలొకి రాగానే చెప్పినట్టుగా ప్రమాణ స్వీకారం చెసిన 15 రొజులకే అక్రమార్కులకు వరంగా మారిన ఇసుక సరఫరా విధానంని రద్దు చేశారు, పూర్తి అధ్యయనం తరువాత ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చారు, ఇసుక కావాలి అనుకున్న వారు ఆన్లైన్ లొ బుక్ చెసుకుని డబ్బు కూడా ఆన్లైన్ లొనే చెల్లించే విధానాన్ని తెచ్చారు, నిబంధనలు ఉల్లంఘించిన టాక్టర్లకు 10వేలు, లారీలకు 25 వేలు, 10 టన్నుల పైబడి రవాణ చెసే లారీలకు, యంత్రాలకు 50వేలు ఫైన్ వేసేలా నిర్ణయించారు. అక్రమాలకు అలువాటుపడ్డవారు, అక్రమాలకు తెరలేపాలని చూస్తే ఐ.పి అడ్రెస్ ఆధారంగా వారిని పట్టుకుని చెరసాలకు పంపారు.

ఇలా సమూలంగా మార్పులు తీసుకువస్తున్నా, ఎక్కడొ ఒక చొట కన్నుగప్పి అక్రమాలకు తెరలేపగల సమర్ధులు ఈ ఇసకాసురులు అని గ్రహించిన ముఖ్యమంత్రిగారు, తాను అన్నుకున్న పారదర్శకత 100శాతం అమలు అవ్వాలనే లక్ష్యం తొ మరొక ముందడుగు వేస్తూ 14500 అనే టొల్ ఫ్రీ నంబర్ ని ప్రవేశపెట్టారు. ఎవరైనా అవినీతికి పాల్పడినా, ఇసుక అధిక ధరలకు అమ్మాలని ప్రయత్నించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయంకి కంప్లైట్ ఇచ్చేలా ప్రజలకు వెసులుబటు కల్పించారు. ఇలాంటి విధానాలు ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదము మోపడంతోపాటు సామాన్యులకి ఇసుక అందుబాటులొకి వచ్చి అవీనితి అనేది కూకటివేళ్ళతొ సహా పెకిళించివేయాగలదనే అభిప్రాయం పర్యవరణ పరిరక్షణ వాదులలొ వినిపిస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News