కోవిడ్ నియంత్రణలో ఆర్టీసి భాగస్వామ్యం - ఆంద్రప్రదేశ్ వినూత్న ప్రయత్నం

By Krishna Babu Jul. 09, 2020, 09:46 pm IST
కోవిడ్ నియంత్రణలో ఆర్టీసి భాగస్వామ్యం - ఆంద్రప్రదేశ్ వినూత్న ప్రయత్నం

ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాప్తి చెంది జనజీవనం ఎక్కడికక్కడ స్తంభింపచేసింది. కోవిడ్ దెబ్బకి దేశాలకు దేశాలే లాక్ డౌన్ విధించుకున్న పరిస్థితి. నెలల తరబడి ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం కావడంతో ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభినం అయిన పరిస్థితి , ఆయా ప్రభుత్వాలకు వచ్చే ఆదాయానికి పూర్తిగా గండిపడి ఆర్ధిక సంక్షోభం దిశగా అడుగులు పడుతున్నయి అని పలువురు ఆర్ధిక నిపుణులు చెబుతున్న మాట . ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఒక పక్క కరోనా మహమ్మారిని సమర్ధవంతమగా ఎదుర్కుంటూనే సంక్షేమానికి పెద్ద పీటవేసి పాలన సాగిస్తుంది.

ఈ నేపద్యంలో ఇప్పటికే జగన్ ప్రభుత్వం కరోనాని ఎదుర్కునే విషయంలో దేశంలోనే అత్యధిక వ్యాది నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా పేరు గడించింది. వాలంటీర్ల వ్యవస్థను సమర్ధవంతంగా వినియోగించుకుంటూ ఇంటింటి సర్వే నిర్వహించి కరోనా బారిన పడిన వారిని గుర్తించి వారిని క్వారంటైన్ కు తరలించి వ్యాది ప్రబలకుండా వేగంగా చర్యలు చేపట్టింది. దీంతో పాటు కోవిడ్ బారిన పడిన వారిని కార్పొరేట్ ఆసుపత్రిలో అయిన సరే వైద్యం చేయించుకుంటే వారిని కూడా అరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చి ఉచితంగా వైద్యం అందిస్తూ సామాన్యులపై భారం పడకుండా రక్షణగా నిలబడింది.

ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాదిని కట్టడి చేయడంలో భాగంగా మరో అడుగు ముందుకు వేసి సంజీవిని పేరిట ఆర్టీసి బస్సులని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. వీటి ద్వార ప్రతి సామాన్యుడికి కరోనా టెస్టు ఉచితంగా నిర్వహించేందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకు 4 కోవిడ్ టెస్ట్ బస్సులను పంపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 54 బస్సుల్లో ఇప్పటికే 30 బస్సులను జిల్లాలకు పంపించామని త్వరలోనే మిగిలిన వాటిని కూడా జిల్లాలకు పంపబోతునట్టు ఆర్టీసీ అధికారులు చెప్పుకొచ్చారు.

ఇప్పటికే మార్క్ ఫెడ్ లాంటి సంస్థలతో ఒప్పందం చేసుకుని రైతులకు విత్తనాల సరఫరా నుంచి ఎరువుల చేరవేత వరకు ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు. మార్కెటింగ్‌ శాఖతో చేసుకున్న ఒప్పందం మేరకు పల్లెవెలుగు బస్సులను మొబైల్‌ జనతా బజార్‌ పేరుతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికీ ఒకటి చొప్పున పంపినట్టు వీటిని ప్రాంతాల వారీగా తిప్పుతూ నిత్యవసర వస్తువులు అమ్మితే ప్రజల్ని రోడ్లపైకి తిరగనివ్వకుండా కట్టడి చేయవచ్చని దీంతో కరోనా ప్రబలడాన్ని అరికట్టవచ్చనే ఉద్దేశంతో వీటిని తెచ్చినట్టు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా పుస్తకాలు, పౌరసరఫరాల శాఖకు బియ్యం, ఇతర పప్పు దినుసులు కూడా బస్సుల ద్వారా సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తునట్టు త్వరలోనే ఆర్టీసి బస్సులను ఈ సేవలకు కూడా వినియోగించుకునేందుకు సిద్దంగా ఉన్నట్టు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి తెలిపారు.

జగన్ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటికి ఎంతో అనుభవం ఉన్న నేతలా కరోనా లాంటి మహమ్మారి రాష్ట్రంలో ప్రబలకుండా కట్టడి చేయడంలో సత్ఫలితాలు సాదించారనే చెప్పాలి. వాలంటీర్ల వ్యవస్థ, అత్యధిక టెస్టులు నిర్వహించడం, కోవిడ్ అనుమానితులను సెల్ టవర్ ఆదారంగా ట్రేస్ చేయడం, కరోనా మహమ్మారి సోకితే సదరు కుటుంబానికి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందించడం, విరివిగా టెస్టింగ్ ల్యాబ్ , ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం, రాష్ట్రంలోకి ప్రవేశించేవారిని సమగ్రంగా టెస్టులు నిర్వహించిన తరువాతే అనుమతించడం లాంటి చర్యలతో కోవిడ్ ని సమర్ధవంతంగా ఎదుర్కుంటున్న రాష్ట్రాల్లో ఆంద్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నేడు ఆర్టీసిని కూడా భాగస్వామ్యం చేయడంతో కోవిడ్ పై పోరులో మరో ముందడుగు వేసిందనే చెప్పాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp