బాషా ఉరఫ్ భాస్కర్ @ ఆర్ఎస్ఎస్

By Voleti Divakar Sep. 19, 2020, 08:31 pm IST
బాషా ఉరఫ్ భాస్కర్ @ ఆర్ఎస్ఎస్

హిందుత్వం, జాతీయవాదంతో పనిచేసే బిజెపి మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ లో ముస్లింలు చేరడం చాలా ఆరుదు. పైగా మెజార్టీ ముస్లింలు ఆర్ఎస్ఎస్ ను ద్వేషిస్తారు. అలాంటిది ఒక ముస్లిం వ్యక్తి పేరు సూర్చుకుని మరీ ఆర్ఎస్ఎస్లో చేరి, చివరి వరకు సంఘంలోనే కొనసాగడం విశేషం. మరణంతో ఆయన మళ్లీ వార్తల్లో నిలిచారు. తన పెన్షన్ సొమ్మును కూడా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో వినియోగించే వారని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గుర్తుచేసుకున్నారు.

నెల్లూరుకు చెందిన కరీంబాషా అనే బాలుడు ఒకరోజున ఆర్ఎస్ఎస్ నిర్వహించే శాఖకు వెళ్లారు. అయితే అక్కడ ముఖ్యశిక్షక్ గా వ్యవహరిస్తున్న మరో బాలుడు ముస్లిం ఆయిన బాషాను శాఖలోకి అనుమతించరని స్పష్టం చేశారు. దీంతో పట్టు వీడన బాషా సంఘం పెద్ద ఎక్కడుంటారో చెప్పాలని కోరగా, నాగ్ పూర్ లో ఉంటారన్న సమాచారం వచ్చింది.

దీంతో బాషా నేరుగా అప్పటి సర్ సంఘ్ చాలక్ గురు గోల్వాల్కర్ (గురూజీ)కి లేఖ రాశారు. గురూజీ స్పందించి బాషాను ఆనుమతించాల్సిందిగా స్థానిక శాఖ బాధ్యులకు లేఖ రాశారు. ఆతరువాత తన పేరును భాస్కర్ గా మార్చుకుని ఆర్ఎస్ఎస్ శాఖకు హాజరయ్యారు బాషా. కొద్దిరోజుల తరువాత గురూజీ నెల్లూరు వస్తూనే రైల్వేస్టేషన్లోనే బాషా ఎవరని వాకబు చేశారట. బాషా ఆలియాస్ భాస్కర్ ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా శాఖకు వెళ్తున్నావా అని గురూజీ
ఆయనను వాకబు చేశారట.

దేశం కోసం తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పేరు మార్చుకుని మరీ ఆర్ఎస్ఎస్ శాఖలో చేరి జిల్లా విభాగ్ స్థాయికి ఎదిగారు బాషా. ఆనారోగ్యంతో భాస్కర్ కన్నుమూయడం పట్ల బిజెపి, ఆర్ఎస్ఎస్ నాయకులు సంతాపం ప్రకటించారు. బాషా లాంటి వ్యక్తులు సమాజంలో చాలా అరుదుగా కనిపిస్తారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp