పాండిచ్చేరి ముఖ్యమంత్రిని ఆకర్షించిన రూ.300/- వైద్యం

By Kiran.G Sep. 22, 2020, 09:46 am IST
పాండిచ్చేరి ముఖ్యమంత్రిని ఆకర్షించిన రూ.300/- వైద్యం

దేశంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కాగా కరోనా సోకితే దానినుండి తక్కువ ఖర్చుతో బయట పడటానికి ఏమేం మందులు వాడాలో ఆంధ్రప్రదేశ్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి సి. ప్రభాకర్ రెడ్డి కొద్దిరోజుల క్రితం సూచించారు. ఈ రూ. 300 మెడిసిన్ కిట్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

తాజాగా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సూచించిన 300/- మెడిసిన్ కిట్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆయన సూచించిన మందులు పాండిచ్చేరి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కృష్ణారావు దృష్టిలో పడటంతో ఆయన వాటిపై ఆసక్తి కనబరుస్తూ పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మందులపై ముఖ్యమంత్రి నారాయణ స్వామి సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు వీటిని ఉచితంగా ప్రజలకు అందజేయడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటానని తెలిపారు.

పాండిచ్చేరి రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ముఖ్యమంత్రి నారాయణ స్వామి,ఆరోగ్య శాఖ మంత్రి కృష్ణారావుతో పాటు మరికొందరు అధికారులు కలిసి అమెరికాకు చెందిన సుప్రసిద్ధ డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి సి. ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తాను సూచించిన మందులను గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రికి డాక్టర్లకు వివరించారు. ఈ 300/- మందులపై డాక్టర్లతో పాటు ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.

వీటిని కరోనా సోకినట్లు అనుమానం ఉన్నా సరే ముందుగా వాడటం ద్వారా సరైన ఫలితాలు ఉంటాయని కరోనాను కట్టడి చేయడంలో ఈ మందులు ప్రధాన పాత్ర పోషిస్తాయని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆయన సూచించిన మందులు కింద చిత్రంలో చూడవచ్చు..


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp