కిలో ప్లాస్టిక్ వ్య‌ర్థాలివ్వండి...కిలో బియ్యం తీసుకోండి

By Sodum Ramana 18-11-2019 03:29 PM
కిలో ప్లాస్టిక్ వ్య‌ర్థాలివ్వండి...కిలో బియ్యం తీసుకోండి
ప్లాస్టిక్ ర‌హిత స‌మాజం కోసం న‌గ‌రి ఎమ్మెల్యే రోజా వినూత్న ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. త‌న పుట్టిన రోజైన న‌వంబ‌ర్ 17న న‌గ‌రిలో ఈ వినూత్న ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఎవ‌రైనా కిలో ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను తీసుకొస్తే కిలో బియ్యం ఇస్తాన‌ని ఆమె ప్ర‌క‌టించారు. అంతేక‌దా కిలో ప్లాస్టిక్ తీసుకొచ్చిన వారికి కిలో బియ్యం పంపిణీ చేశారు.

న‌గ‌రి ట‌వ‌ర్‌క్లాక్ సెంట‌ర్‌లో నిర్వ‌హించిన వేడుక‌ల్లో చిత్తూరు ఎంపీ రెడ్డ‌ప్ప‌తో క‌ల‌సి ఆమె పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్ర‌తి పుట్టిన రోజుకు ఏదో ఒక స‌మాజ హితానికి సంబంధించి కార్యక్ర‌మాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది కూడా ప్లాస్టిక్‌ను పార‌దోలేందుకు చేప‌ట్టిన కిలో వ్య‌ర్థ ప్లాస్టిక్ వ‌స్తువుల‌కు కిలోబియ్యం ప‌థ‌కానికి తొలి రోజు నుంచే విశేష స్పంద‌న ల‌భించింద‌న్నారు.

ప్ర‌ధానంగా అవాయిడ్ ప్లాస్టిక్‌...సేవ్ నేచ‌ర్ నినాదంతో కిలో ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌కు కిలో బియ్యం ప‌ధ‌కాన్నిప్ర‌వేశ పెట్టామ‌న్నారు. ప్లాస్టిక్ భూమిలో క‌ల‌వ‌డానికి 400 ఏళ్లు ప‌డుతుంద‌న్నారు. అందువ‌ల్లే ప్లాస్టిక్‌పై ప్ర‌తి ఒక్క‌రూ యుద్ధం ప్ర‌క‌టించాల‌న్నారు. న‌గ‌రితో పాటు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌మాద‌క‌ర ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను నిషేధించేలా చర్య‌లు తీసుకోవాల‌ని రోజా కోరారు. 
idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News