రవి ప్రకాష్‌ కి వచ్చే నెలలోనే రాజ యోగం ?

By Raju VS Oct. 27, 2020, 10:00 pm IST
రవి ప్రకాష్‌ కి వచ్చే నెలలోనే రాజ యోగం ?

టీవీ9 ద్వారా అందరికీ చిరపరిచితుడైన రవి ప్రకాష్‌ కి రాజ్ యోగం పట్టినట్టే కనిపిస్తోంది. ఏడాదిన్నరగా తెరమరుగైన ఆయనకు మళ్లీ తెర మీద కనిపించేందుకు అవకాశం వస్తోంది. తమిళనాడుకి చెందిన మీడియా గ్రూప్ రాజ్ న్యూస్ తెలుగు చానెల్లో రవి ప్రకాష్‌ ఎంట్రీ దాదాపు ఖాయం అయ్యింది. తాజాగా ఆయన కార్యాలయంలో కాలు పెట్టి దానికి తగ్గట్టుగా సంకేతాలు ఇచ్చేశారు.

టీవీ9 యాజమాన్యం మార్పిడి సమయంలో అతిగా వ్యవహరించి రవి ప్రకాష్‌ ఇక్కట్లు కొనితెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. చివరకు దాని మూలంగా ఆయన జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. రవి ప్రకాష్‌ తర్వాత టీవీ9 లో కూడా పలు మార్పులు జరిగాయి. ఆయన స్థానంలో టీవీ9 ప్రధాన బాధ్యతలు స్వీకరించిన గొట్టిపాటి సింగారావు ఇటీవల ఆ సంస్థను వీడాల్సి వచ్చింది. అంతకుముందే రవి ప్రకాష్‌ అనుచరులు అనేక మందిని ఆయన చానెల్ నుంచి సాగనంపారు. సుదీర్ఘకాలం పాటు అక్కడే తిష్టవేసిన వారికి తిరిగుటపా పంపించారు.

ఇక రజనీకాంత్ వ్యవహారం కూడా అనుమానాస్పదంగా మారిన నేపథ్యంలో ఇటీవల సింగారావు అవుట్ కావడం ఆయనకు కలిసి వచ్చిందని చెబుతున్నారు. అదే సమయంలో తాజాగా రవి ప్రకాష్ రాజ్ న్యూస్ తెలుగు చానెల్ లో ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగతా మారింది. రాజ్ న్యూస్ కి తెలుగు మూడు చానెళ్ళున్నాయి. కానీ అవి పెద్దగా ప్రాచుర్యం సాధించలేదు. పైగా వాటి ప్రసారాల సంగతి కూడా చాలామందికి తెలియదు. అలాంటి సంస్థలో ఇప్పుడు రవి ప్రకాష్‌ ఎంట్రీతో ఎలాంటి మార్పులు జరుగుతాయన్నది అందరిలో చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి టీవీ9 సమయంలో తెలుగు మీడియాలో అలాంటి ప్రయోగాలు లేకపోవడంతో ప్రజాదరణకు కారణమయ్యంది. కానీ ప్రస్తుతం శాటిలైట్ చానెళ్ల పరిస్థితి అంతంతమాత్రంగా మారిన తరుణంలో రవి ప్రకాష్‌ ముద్ర ఏమేరకు అన్నది సందేహాస్పదంగా మారింది.

వచ్చే నెల 4వ తేదీ నుంచి రవి ప్రకాష్‌ సారధ్యంలో కి రాజ్ న్యూస్ తెలుగు చానెల్ మారబోతోంది. బీజేపీకి అనుగుణంగా ఈ చానెల్ ఉంటుందని సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కమలనాధుల గొంతు వినిపించేందుకు తగిన చానెల్ లేదని మథన పడుతున్న సమయంలో రవి ప్రకాష్‌ ద్వారా దానిని నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ అది అంత సులువు కాదని వర్తమాన పరిస్థఙతులు చెబుతున్నాయి. దాంతో రవి ప్రకాష్‌ రీ ఎంట్రీ మూలంగా ఏం జరుగుతుందన్నది చర్చనీయాంశమే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp