ఏపీలో మహిళలకు 'రక్షాబంధన్' 

By Voleti Divakar Aug. 01, 2020, 10:15 pm IST
ఏపీలో మహిళలకు 'రక్షాబంధన్' 

ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణకు రక్షాబంధన్ పేరిట ప్రత్యేక అవగాహన, చైతన్య కార్యక్రమానికి పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. మహిళలు, బాలికలు సైబర్, ఇతర వలలో చిక్కుకోకుండా ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాంఛనంగా ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. డిజిపి గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు మహిళల రక్షణ కోసం సిఐడి విభాగం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది.

యూట్యూబ్, చానళ్లు, ఇతర ఆన్లైన్ మాధ్యమాల ద్వారా మహిళలు, బాలికలకు రక్షాబంధన్ పై అవగాహన కల్పిస్తారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో కూడా దీనిపై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తారు. ఇందుకోసం సైబర్ సెక్యూరిటీలో నిపుణులును వినియోగిస్తున్నారు. ఈ కరోనా కాలంలో దేశవ్యాప్తంగా ప్రజలు.. ముఖ్యంగా యువత ఆన్ లైన్ వేదికలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. తద్వారా ఇటీవల పలువురు మహిళలు, యువతులు, బాలికలు సైబర్ మాయగాళ్ల వలలో చిక్కుకుని అన్ని విధాలుగా మోసపోయిన సంఘటనలు కోకొల్లలుగా నమోదువుతున్నాయి.

దీన్ని దృష్టిలో ఉంచుకుని సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టి, మహిళలు, యువతులు, విద్యార్థినులను అప్రమత్తం చేసేందుకు జగన్ సర్కార్ అందుబాటులోకి తీసుకుని రానున్న ఆన్లైన్ ప్రోగ్రాం 'రక్షాబంధన్' ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp