పైలెట్‌ను దువ్వుతున్న సీఎం అశోక్‌ గెహ్లత్‌

By Kotireddy Palukuri Aug. 01, 2020, 07:46 pm IST
పైలెట్‌ను దువ్వుతున్న సీఎం అశోక్‌ గెహ్లత్‌

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్నది నానుడి. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా రాజస్థాన్‌ రాకీయాల్లోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీతో కలసి తన ప్రభుత్వాన్ని కూలదోచేందుకు యత్నించారంటూ సచిన్‌ పైలెట్‌పై తీవ్ర ఆరోపణలు చేసి పీసీసీ ప్రెసిడెంట్, డిప్యూటీ సీఎంల నుంచి ఉద్వాసన పలకడంలో కీలకంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లత్‌ మారిన రాజకీయ పరిస్థితుల్లో తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు సచిన్‌ను దువ్వుతున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం సచిన్‌ను క్షమిస్తే.. సచిన్, అతని వర్గం ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తామని ప్రకటించారు.

ఈ నెల 14వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సమయంలో అశోక్‌ గెహ్లాత్‌ తాజా ప్రకటన ఆసక్తిని రేపుతోంది. తనకు 102 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని చెబుతున్న అశోక్‌.. వారిని కాపాడుకునేందుకు ప్రస్తుతం జైపూర్‌లోని ఓ హోటల్‌ ఉన్న క్యాంపును జైసల్మీర్‌కు మార్చారు. ఒక రోజు వారితో గyì పినlఅశోక్‌.. అక్కడ నుంచి జైపురకు బయలుదేరే ముందు ఈ ప్రకటన చేశారు. తనకు మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చిన కాంగ్రెస్‌ అధిష్టానం సచిన్‌ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానన్నారు. బీజేపీ తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు తన వర్గం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నిస్తోందని అరోపించారు.

కాంగ్రెస్‌లో చేరిన తమ పార్టీ ఆరుగురు ఎమ్మెల్యేలపై రాజస్థాన్‌ హైకోర్టులో బీఎస్పీ పిటిషన్‌ దాఖలు చేయడం, మరో వైపు తన వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ‘చే’జారిపోతారన్న ఆందోళన అశోక్‌ గెహ్లాత్‌లో మొదలైందన్న భావన తాజాగా ఆయన వ్యాఖ్యలలో కనిపిస్తోంది. సచిన్‌ పైలెట్‌ను తీవ్ర స్థాయిలో తిట్టిపోసిన అశోక్‌.. తాజాగా సచిన్‌ వస్తే ఆహ్వానిస్తామని చెప్పడం వెనుక అసెంబ్లీలో బలనిరూపణకు దిగితే గెలవలేమనే అంచనాకు అశోక్‌ వచ్చినట్లు కనిపిస్తోంది.

200 ఎమ్మెల్యేలు గల రాజస్థాన్‌ శాసన సభలో సాధారణ మెజారిటీకి 101 ఓట్లు కావాలి. ప్రస్తుతం అశోక్‌ తన వద్ద 102 మంది ఉన్నారని చెబుతున్నారు. అయితే ఇందులో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలతోపాటు 12 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. బలనిరూపణ జరిగే నాటికి వీరిలో ఎంత మంది అశోక్‌ వర్గంలో ఉంటారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. సచిన్‌ పైలెట్‌ వర్గంపై అసెంబ్లీ సమావేశాల్లో అనర్హత వేటు వేసేలా ప్లాన్‌ చేసి ఆ తర్వాత విశ్వాస పరీక్షకు దిగినా 91 మంది ఎమ్మెల్యే మద్ధతు అవసరం. ఆ సంఖ్య కూడా అశోక్‌ వద్ద ఉంటుందా..? అనేది అనుమానమే. ఈ క్రమంలోనే తిరిగి సచిన్‌ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు అశోక్‌ సంసిద్ధతతో ఉన్నట్లు ఆయన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. అసెంబ్లీకి ఇంకా 13 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఈ మధ్యలో రాజస్థాన్‌ రాజకీయంలో ఎన్ని ట్విస్ట్‌లు, మలుపులు చోటుచేసుకుంటాయో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp